టీడీపీకి నామా రాంరాం : లైవ్ లోనే కండువా తీసేశాడు

టీడీపీకి నామా రాంరాం : లైవ్ లోనే కండువా తీసేశాడు

టీడీపీకి నామా రాంరాం : లైవ్ లోనే కండువా తీసేశాడు

తెలంగాణలో తెలుగుదేశంకు ఉన్న అతికొద్దిమంది నేతలలో ఒకరు నామా నాగేశ్వరరావు. ఆయన కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ గూటికి చేరేందుకు సిద్ధం అయ్యారు. తెలుగుదేశం పొలిట్ బ్యూరో పదవికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి నామా రాజీనామా ఇచ్చేశారు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున పోటీ చేసిన నామా టీఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌‌ చేతిలో ఓడారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నామా.. రెండు రోజుల క్రితం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిశారు. ఈ క్రమంలో ఖమ్మం సీటుపై నామాకు హామీ రావడంతో నామా నాగేశ్వరరావు కారు ఎక్కడం ఖాయమైంది.
Read Also : వైసీపీది నేరగాళ్ళ ప్రకటన : టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు

మరో రెండు రోజుల్లో ఆయన పార్టీ మారనున్నట్లు చెబుతున్నారు. నామా నాగేశ్వరరావు సుధీర్ఘకాలం టీడీపీలో ఉన్నారు. 2004లో టీడీపీ తరపున ఖమ్మం నుంచి ఎంపీగా పోటీచేసి రేణుకా చౌదరి చేతిలో ఓడిన నామా 2009లో రేణుకపై గెలిచారు. 2014లో మళ్లీ బరిలోకి దిగిన నామా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే 2019ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తారు అని ప్రచారం జరగగా ఆయన రూటు మార్చి కారు ఎక్కారు. ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ లైవ్ ఏర్పాటు చేసిన నామా లైవ్‌లోనే పసుపు కండువా తీసేశారు.
Read Also : వైసీపీ నుంచి టీడీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే

×