Kangana Ranaut : కంగనాపై కేసు నమోదు చేయండి – నాంపల్లి కోర్టు ఆదేశం

భారత దేశ స్వతంత్ర ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై దేశ వ్యాప్తంగా పోలీసులు కేసులు నమోదవుతున్నాయి.

10TV Telugu News

Kangana Ranaut : భారత దేశ స్వతంత్ర ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై దేశ వ్యాప్తంగా పోలీసులు కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం నాంపల్లి కోర్టు కంగనాపై కేసు నమోదు చేయాలనీ ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాది కొమిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు. ఐపీసీ 504,505 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని సైఫాబాద్ పోలీసులను ఆదేశించింది

చదవండి : Kangana Ranaut: సిక్కులను కించపరిచే కామెంట్లు చేసిందని కంగనాపై ఎఫ్ఐఆర్

ఇక సిక్కులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కూడా తాజాగా ఈమెపై కేసు నమోదైంది. కాగా కంగనాపై గత వారం రోజుల్లో 10కిపైగా కేసులు నమోదయ్యాయి. ముంబై, పంజాబ్‌తోపాటు పశ్చిమ బెంగాల్‌లో కూడా కేసులు నమోదు చేశారు.

చదవండి : Kangana..farm laws : వ్యవసాయ చట్టాల రద్దుపై కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు

×