ఒకే వేదికపై నందమూరి హీరోలు.. ఎన్టీఆర్ ఏం చెప్తాడు

  • Published By: vamsi ,Published On : February 25, 2019 / 02:38 AM IST
ఒకే వేదికపై నందమూరి హీరోలు.. ఎన్టీఆర్ ఏం చెప్తాడు

అభిమాన హీరోలు వేదికపై కనిపిస్తే వారి ఆనందానికి హద్దులు ఉండవు. నందమూరి అభామానులు ఎంతగానో ఎదురుచూసే కలయిక ఏదైనా ఉందంటే అది జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ కలయికే. ఎంతోకాలంగా వీరి మధ్య వైరం ఉందంటూ వార్తలు రాగా.. ‘అరవింద సమేత’ సినిమా సక్సెస్ ఫంక్షన్ లో వీరిద్దరి కలియికతో అటువంటి అనుమానాలు తొలిగిపోయాయి. తరువాత బాలకృష్ణ హీరోగా తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ఆడియో వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. అయితే ఇప్పుడు మరోసారి వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించబోతున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరోగా నటించిన 118 చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా రాబోతున్నారు. అలాగే సొదరుడి సినిమాను ప్రమోట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారు. 

కళ్యాణ్ రామ్‌ నటించిన “118” చిత్రం మార్చి 1వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఇవాళ(ఫిబ్రవరి 25వ తేదీన) చిత్రబృందం నిర్వహిస్తుంది. ఈ వేడుకకు నందమూరి హీరోలు రానుండడంతో అభిమానుల్లో కోలాహలం నిండింది. బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాపై ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదని నిరాశతో ఉన్న అభిమానులు ఈ వేధికపై నుండి ఎన్టీఆర్ బయోపిక్ సినిమాల గురించి ఏమైనా చెప్తారని కూడా భావిస్తున్నారు.

  ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై “118” చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన షాలిని పాండే, నివేదా థామస్ నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్‌ దర్శకత్వం వహించారు. ప్రముఖ పీఆర్వో మహేష్‌ కోనేరు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో రూపొందిన ‘118′ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి.

118MoviePreReleaseEvent