Sangareddy : ట్రైనింగ్ నర్సును వేధించాడు…వేటు పడింది

ట్రైనింగ్ నర్సుతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ పై సస్పెన్షన్ వేటు పడింది.

Sangareddy : ట్రైనింగ్ నర్సును వేధించాడు…వేటు పడింది

Sangareddy

Narayankhed Area Hospital : ట్రైనింగ్ నర్సుతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ పై సస్పెన్షన్ వేటు పడింది. తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తునట్లు 2021, డిసెంబర్ 03వ తేదీ శుక్రవారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గా నర్సింగ్ చౌహాన్ విధులు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రిలో ఓ యువతి నర్సింగ్ కోర్సు పూర్తి చేసింది.

Read More : Electricity tariff in Telangana: తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు!

ఇటీవలే ఆమె ట్రైనింగ్ కంప్లీట్ కావడంతో సర్టిఫికేట్ కోసం 2021, డిసెంబర్ 02వ తేదీ గురువారం ఆసుపత్రికి వచ్చారు. అయితే…సర్టిఫికేట్ ఇవ్వకుండా..తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని యువతి ఆరోపించింది. సర్టిఫికెట్ ఇస్తే తనకేమిస్తావంటూ వేధించడంతో ఆమె తన కుటుంబ సభ్యులకు విషయాన్ని చెప్పింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని..సూపరింటెండెంట్ ను నిలదీశారు.

Read More : AP Flood : వరద బాధితులకు సీఎం జగన్ భరోసా, అండగా ఉంటామని హామీ

అనంతరం అతడికి దేహశుద్ధి చేశారు. అనంతరం ట్రైనింగ్ నర్సు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన చాంబర్ కు తీసుకెళ్లి వ్యక్తిగత విషయాలు అడుగుతూ..అసభ్యకరంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో వెల్లడించంది. అనంతరం దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు. అతనిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.