Modi about Singareni: సింగరేణిని ప్రైవేటుపరం చేసే ఆలోచన కేంద్రానికి లేదు: స్పష్టం చేసిన మోదీ

సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వస్తున్న ప్రచారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆర్ఎఫ్సీఎల్‌లో ఎరువుల ఉత్పత్తి ఫ్యాక్టరీని, పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. సింగరేణిని ప్రైవేటుపరం చేసే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. సింగరేణి విషయంలో కొందరు అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. దాన్ని ప్రైవేటుపరం చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

Modi about Singareni: సింగరేణిని ప్రైవేటుపరం చేసే ఆలోచన కేంద్రానికి లేదు: స్పష్టం చేసిన మోదీ

Modi about Singareni: సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వస్తున్న ప్రచారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆర్ఎఫ్సీఎల్‌లో ఎరువుల ఉత్పత్తి ఫ్యాక్టరీని, పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. సింగరేణిని ప్రైవేటుపరం చేసే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. సింగరేణి విషయంలో కొందరు అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. దాన్ని ప్రైవేటుపరం చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదని ప్రధాని మోదీ అన్నారు. మెజార్టీ వాటా రాష్ట్రానిదైతే కేంద్ర ప్రభుత్వం ఎలా అమ్ముతుందని నిలదీశారు. హైదరాబాద్ నుంచి కొందరు సింగరేణిపై తప్పుడు ప్రచారం చేస్తూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని అన్నారు. కాగా, అభివృద్ధి పనుల మంజూరు ప్రక్రియలో వేగం పెంచామని ప్రధాని మోదీ చెప్పారు. దీంతో అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలూ పెరుగుతాయని అన్నారు.

ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందని మోదీ అన్నారు. తాము ఎనిమిదేళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకే ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. ఫర్టిలైజర్ ప్లాంట్, రైల్వే జోన్, రోడ్ల విస్తరణ వంటి వాటితో రాష్ట్ర ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు. అంతకు ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆయన కూడా సింగరేణిపై స్పందించారు. సింగరేణిని ప్రైవేటుపరం చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..