నర్సాపూర్ 112 ఎకరాల స్కాం, మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి పాత్ర ఉందా ?

  • Published By: madhu ,Published On : September 10, 2020 / 12:48 PM IST
నర్సాపూర్ 112 ఎకరాల స్కాం, మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి పాత్ర ఉందా ?

Narsapur 112 acres scam : నర్సాపూర్ 112 ఎకరాల స్కాంలో ఏసీబీ చేపడుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మెదక్ జిల్లా మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి పాత్ర ఉందా అనే దానిపై ఏసీబీ ఆరా తీస్తున్నట్లు సమాచారం. జులై 31న ఆయన రిటైర్ మెంట్ అయ్యారు. రిటైర్మెంట్ ముందు రోజు..బాధితుడు మూర్తికి ఇవ్వాల్సిన ఎన్ వోసీ ఫైల్ పై సంతకం చేసినట్లు తెలుస్తోంది.




కలెక్టర్ తో సంతకం చేయిస్తానని, మూర్తి నుంచి కలెక్టర్ కు అడిషనల్ కలెక్టర్ నగేష్ వాటా అడిగారు. చిలిపిచేడ్ లో వివాదాస్పద భూమని నిషేధిత జాబితా నుంచి తీసేయాలని రిటైర్మెంట్ రోజున స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ కు ధర్మారెడ్డి లేఖ రాశారని దర్యాప్తులో ఏసీబీ అధికారులు గుర్తించారని తెలుస్తోంది.
https://10tv.in/rs-one-crore-12-lakh-crore-bribery-case-acb-searches-at-medak-collector-residence/
కలెక్టర్ ఆదేశాల మేరకు 112.21 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రిజస్ట్రర్ కు కమినర్ ఆదేశాలు చేయడం జరిగిపోయాయని సమాచారం. దీంతో ధర్మారెడ్డి పాత్రపై విచారణ చేయాలని ఏసీబీ భావిస్తోంది.



112 ఎకరాల ల్యాండ్ వ్యవహారంలో…కోటి 12 లక్షల లంచం తీసుకున్న మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేశ్…ఇంట్లో ఏసీబీ తనిఖీలు ముగిశాయి. నగేశ్ ను హైదరాబాద్ లోని ఏసీబీ ప్రధాన ఆఫీసుకు తరలిస్తోంది. 112 ఎకరాల భూమి స్కాంలో నగేష్ తో పాటు ఐదుగురిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

ఆర్డీవో అరుణారెడ్డి, తహశీల్దార్ అబ్దుల్ సత్తార్, జూ.అసిస్టెంట్ వసీం మహ్మద్, జీవన్ గౌడ్ లు అరెస్టయిన వారిలో ఉన్నారు. వీరిని ఇప్పటికే ఏసీబీ కార్యాలయానికి తరలించారు. వీరందరినీ వైద్య పరీక్షలకు తరలించి…అనంతరం కోర్టులో హాజరు పరుచనున్నారు.




లంచం డబ్బుల కింద 10 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయాలంటూ..నగేశ్ డిమాండ్ చేశారు. ఈ విధంగా చేయకపోతే..ఎన్ వోసీ ఇవ్వనని బాధితులకు స్పష్టం చేశారు.
రూ. 40 లక్షల నగదు ఇవ్వాలని కూడా చెప్పారు. దీనికి బాధితులు అంగీకరించలేదు.