Shehzad Poonawala: ఆ విషయం తెలుసుకొనేందుకు ‘నాసా’ కాంగ్రెస్ పార్టీని సంప్రదించిందట.. రాహుల్‌పై బీజేపీ నేత వ్యంగాస్త్రాలు

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మళ్లీ మళ్లీ విఫలమైన రాకెట్ ను ఎలా ప్రయోగించాలో చెప్పాలంటూ నాసా కాంగ్రెస్ పార్టీని సంప్రదించిందంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

Shehzad Poonawala: ఆ విషయం తెలుసుకొనేందుకు ‘నాసా’ కాంగ్రెస్ పార్టీని సంప్రదించిందట.. రాహుల్‌పై బీజేపీ నేత వ్యంగాస్త్రాలు

Rahul Gandhi

Shehzad Poonawala: బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ‘మెహంగాయ్ పర్ హల్లా బోల్’ నినాదంతో ర్యాలీ జరగనుంది. ఢిల్లీలో జరిగే ఈ ర్యాలీని రాహుల్ గాంధీ పాల్గొని ప్రారంభిస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం నిర్వహించిన బహిరంగ సభను ఉద్దేశించి రాహుల్ మాట్లాడతారు.

Congress protest rally: ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ తలపెట్టిన నిరసన ర్యాలీకి భారీగా తరలివస్తోన్న నేతలు, కార్యకర్తలు

రాహుల్ గాంధీ ప్రసంగించాల్సిన ర్యాలీని ఉద్దేశిస్తూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. నాసా చంద్రుడిపైకి ప్రయోగించేందుకు సిద్ధంచేసిని ఆర్టెమిస్ -1 ప్రయోగం ఇప్పటికే రెండు సార్లు సాంకేతిక లోపం వల్ల నిలిచిపోయిన విషయం విధితమే. విఫలమైన రాకెట్ ను మళ్లీ మళ్లీ ఎలా రీలాంచ్ చేయాలో తెలుసుకొనేందుకు నాసా కాంగ్రెస్ పార్టీని సంప్రదించిందని అంటూ రాహుల్ పై విమర్శలు చేశారు. ‘మెహంగాయ్ పర్ హల్లా బోల్ ’ సీజన్-5ను సూచిస్తుందని పూనావాలా అన్నారు.

రాహుల్ రీ లాంచ్ సీజన్ 5 ఈరోజు హలా బోల్‌తో ప్రారంభమైంది. అలాగే.. మమత బెనర్జీ, కేసీఆర్, అరవింద్ , నితీష్ జీలు నటించిన ‘మై హూనా’ తెరపైకి వచ్చిందంటూ విమర్శించారు.  తాజాగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ర్యాలీ అనంతరం సెప్టెంబర్ 7 నుంచి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3,500 కిలో మీటర్లమే భారత్ జోడో యాత్రను ప్రారంభించనున్నారు.