Naveen Case: ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయం ముందు నవీన్ కుటుంబ సభ్యుల ఆందోళన

నిహారిక రెడ్డికి నవీన్ హత్య కేసులో బెయిల్ రావడంపై వారు మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిహారికకు ఇంత త్వరగా ఎలా బెయిల్ వస్తుందని నిలదీస్తున్నారు.

Naveen Case: ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయం ముందు నవీన్ కుటుంబ సభ్యుల ఆందోళన

Naveen case

Naveen Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, ఇవాళ హైదరాబాద్ లోని ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయం ముందు నవీన్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నవీన్ హత్య కేసులో మూడో నిందితురాలుగా ఉన్న నిహారిక రెడ్డికి బెయిల్ రావడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిహారికకు ఇంత త్వరగా ఎలా బెయిల్ వస్తుందని మృతుడి కుటుంబ సభ్యులు నిలదీస్తున్నారు.

నిందితుడు హరిహర కృష్ణ పారిపోవడానికి సహాయం చేసిన ఆమె పట్ల అలసత్వం ఎందుకని ప్రశ్నించారు. పోలీసులు నిందితులపై ఏ చర్యలు తీసుకుంటున్నారో తమకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. నవీన్ హత్యకు కారణమైన వారిని ఉరితీయాలంటూ డీసీపీ ఆఫీస్ ముందు నినాదాలు చేస్తున్నారు.

కాగా, అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణతో పాటు నిహారిక, అతడి స్నేహితుడు హాసన్ లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నవీన్ కేసులో నిందితుడు హరిహరకృష్ణకు నిహారిక సహకరించడమే కాకుండా హత్య విషయం తెలిసినా దాచి పెట్టినందుకు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిహారికకు బెయిల్ దక్కడంతో నవీన్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Andhrapradesh: అనుమతి ఉన్నా అరెస్ట్‌లా? ప్రభుత్వం దిగిరాకుంటే నిరవదిక పోరాటాలకు సిద్ధం