Remdesivir Theft : ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సు నిర్వాకం..రెమిడెసివర్ దొంగిలించి బ్లాక్ లో అమ్ముకుంటున్న వైనం

Remdesivir Theft : ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సు నిర్వాకం..రెమిడెసివర్ దొంగిలించి బ్లాక్ లో అమ్ముకుంటున్న వైనం

Remdesivir Theft

remdesivir injections theft at govt hospital by nurse :  ఈ రోజుల్లో రెమిడెసివర్..ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దందా బాగా ఎక్కువైపోయింది. కరోనా కల్లోలం రేపుతున్న క్రమంలో రెమిడెసివర్ ఇంజక్షన్లు దందా అంతా ఇంతా కాదు. చోరీలు, బ్లాక్ మార్కెట్లలో అమ్ముకోవటం. రెమిడెసివర్ పేరుతో సెలైన్ వాటర్‌ను అమ్మటం వంటి మోసాలకు పాల్పడుతున్న క్రమంలో ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ నర్సు ఏకంగా ఆస్పత్రిలో ఉండే రెమిడెసివర్‌ను సైలెంట్ గా చోరీ చేసి బైట చక్కగా బ్లాక్‌లో అమ్మేసుకంటోంది.శవాలమీద పైసలు ఏరుకుని తినే రకాలు ఎక్కువపోయారు. పరిస్థితులుండగానే చక్కబెట్టేసుకోవాలన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఈక్రమంలో తెలంగాణాలోని నిజామాబాద్ జిల్లాలో ఓ నర్సు రెమిడెసివర్ ఇంజక్షన్లను చోరీ చేసి అమ్మేసుకుంటోంది.

కరోనా రోగుల బలహీనతను..అవసరాన్ని ఆసరాగా చేసుకుంటూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు.. అసలే అప్పుల పాలై కరోనా చికిత్స చేయించుకుంటున్న పరిస్థితుల్లో మోసాలకు బలైపోతున్నారు. అలా నిజామాబాద్ లో వాడిపడేసిన రెమిడీసీవీర్ ఇంజక్షన్ సీపాల్లో సెలైన్ వాటర్ ను ఎక్కించి అమ్మిన సంఘటన మరవకముందే..ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ నర్సు ఆసుపత్రిలోని రెమిడెసివర్ ఇంజక్షన్లు బయటకు తీసుకువచ్చి బ్లాక్‌లో అమ్ముతోంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

నర్సు అంటే సేవకు ప్రతిరూపం. కానీ కంచె చేనుమేస్తే అన్నట్లుగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రేమిడేవిస్ ఇంజక్షన్లు పక్కదారి పట్టిస్తూ ఓ నర్సు అడ్డంగా దొరికిపోయింది…ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ నర్సుగా పనిచేస్తున్న శ్రావణి ఆసుపత్రి రెండు రెమిడీసీవీర్ ఇంజక్షన్లను దొంగిలించి తన భర్త అరుణ్ అందించింది.. అరుణ్ వాటిని బ్లాక్ మార్కెట్ లో అమ్మకానికి పెట్టాడు.. నిఖిల్ సాయి హోటల్ వద్ద ఒక్కో డోస్ 25 వేల కు వేరే వ్యక్తులకు అమ్ముతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు..ఆ తరువాత కాసుల కోసం కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సదరు నర్సుతో పాటు ఆమె భర్తపై కేసు నమోదు చేశారు. ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కరోనా పరిస్థితుల్లో శానిటైజర్ దగ్గర నుంచి రెమిడెసివర్‌ వరకు మొత్తం నకిలీవి తయారు చేసి అమ్ముకుంటున్న దందాలు పెరిగిపోతున్నాయి.ప్రజల్లో భయాందోళనలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ప్రాణాన్ని కాపాడుకోవాలకుని మోసగాల్లు డిమాండ్ చేసినంత డబ్బులిచ్చి నకిలీవి కొని మోసపోతున్నారు. ఆ తరువాత తామ మోసపోయామని తెలిసి పోలీసులతో మొరపెట్టుకుంటున్నారు. ఇవన్ని ఈ రోజుల్లో సర్వ సాధారణంగా మారిపోయాయి.కోవిడ్‌ నుంచి బైటపడేందుకు రెమిడెసివర్‌ ఇంజక్షన్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకున్న మోసగాళ్లు అమాయకులను క్యాష్‌ చేసుకున్నారు.