Basara IIIT Students: వెనక్కి తగ్గిన విద్యార్థులు.. మంత్రి హామీతో ఆందోళన విరమణ

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వెనక్కి తగ్గారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీతో ఆందోళన విరమణకు విద్యార్థులు అంగీకరించారు. గత వారం రోజులుగా సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాటపట్టిన విద్యార్థులు సీఎం కేసీఆర్ వచ్చి తమ సమస్యల పరిష్కారంకై హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. సోమవారం రాత్రి విద్యార్థుల వద్దకు స్వయంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెళ్లి చర్చలు జరిపారు. నెలరోజుల్లోనే డిమాండ్లన్నీ నెరవేరుస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విమరణకు విద్యార్థులు అంగీకరించారు.

Basara IIIT Students: వెనక్కి తగ్గిన విద్యార్థులు.. మంత్రి హామీతో ఆందోళన విరమణ

Ministar Sabitha

Basara IIIT Students: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వెనక్కి తగ్గారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీతో ఆందోళన విరమణకు విద్యార్థులు అంగీకరించారు. గత వారం రోజులుగా సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాటపట్టిన విద్యార్థులు సీఎం కేసీఆర్ వచ్చి తమ సమస్యల పరిష్కారంకై హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. పలుదఫాలుగా అధికారులు, స్థానిక మంత్రి చర్చలు జరిపినప్పటికీ వెనక్కి తగ్గలేదు. పట్టువీడకుండా ఆందోళన కొనసాగిస్తున్న విద్యార్థుల వద్దకు స్వయంగా విద్యాశాఖ మంత్రి సబితా వెళ్లి చర్చలు జరిపారు. నెలరోజుల్లోనే డిమాండ్లన్నీ నెరవేరుస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విమరణకు విద్యార్థులు అంగీకరించారు.

Basara IIIT : బాసర ట్రిపుల్‌ ఐటీలో హైటెన్షన్‌..చిచ్చు రేపిన మంత్రి సబితా సిల్లీ డిమాండ్స్‌ కామెంట్స్‌

విద్యార్థులతో చర్చలు జరిపేందుకు సోమవారం రాత్రి 9.30గంటల ప్రాంతంలో మంత్రి సబితా ఇంధ్రారెడ్డితో పాటు విద్యాలయ ఉపకులపతి రాహుల్ బొజ్జా, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ కుమార్, విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణలు క్యాంపస్ కు వెళ్లారు. తొలుత 20మంది ఎస్జీసీ( స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్) విద్యార్థులతో ఆడిటోరియంలో చర్చలు ప్రారంభించారు. అర్థరాత్రి 12.30 గంటల వరకు చర్చలు కొనసాగాయి. ఒక్కో సమస్యపై విద్యార్థులతో చర్చించి మంత్రి వాటి పరిష్కారం కోసం హామీ ఇచ్చారు. వీసీ నియామకంతో సహా అన్ని సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని, నెల రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి విద్యార్థులకు హామీ ఇచ్చారు. అయితే  రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని విద్యార్థులు కోరగా.. సంబంధిత శాఖ మంత్రిని స్వయంగా చెప్తున్నా.. ఇంకా ఎలాంటి హామీ కావాలని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

Secunderabad Violence Remand Report : సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

మంత్రి హామీతో ఆందోళన విరమించాలా, కొనసాగించాలా అన్నదానిపై చర్చించుకున్న విద్యార్థులు.. అనంతరం క్యాంపస్‌ ప్రధాన గేటు వద్దకు వచ్చి మీడియాతో మాట్లాడారు. డిమాండ్లను పరిష్కరిస్తారని మంత్రిపై, అధికారులపై నమ్మకం ఉందని.. ఆందోళన విరమిస్తున్నామని ప్రకటించారు. దీంతో నేటి నుంచి విద్యార్థులు తరగతులకు హాజరు కానున్నారు.