ప్రియుడు, ప్రియురాలు పక్కా ప్లాన్..పని మనుషులుగా చేరి దోచేస్తున్న నేపాల్ ‘కైలాలీ గ్యాంగ్’ :

  • Published By: nagamani ,Published On : October 22, 2020 / 04:54 PM IST
ప్రియుడు, ప్రియురాలు పక్కా ప్లాన్..పని మనుషులుగా చేరి దోచేస్తున్న నేపాల్ ‘కైలాలీ గ్యాంగ్’ :

Nepal gang hyderabad nacharam HMT Nagar robbery: భార్యాభర్తలంటూ ఇంట్లో పనిమనుషుల్లా చేరి ఆ ఇంటికే దోచేస్తున్నా ఓ ప్రియుడు ప్రియురాలు. గత సోమవారం (అక్టోబర్ 19,2020) రాత్రి నాచారం హెచ్ ఎంటీ నగర్ లో నివసిస్తున్న ఓ వృద్ధురాలికి మత్తు మందిచ్చి రూ.10 లక్షల నగదు 18 తులాల బంగారం, 40 తులాల వెండిని దోచేసిందో ముఠా. ఈ ఘటనపై రాచకొండ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ చోరీలో ముగ్గురి హస్తం ఉందని గుర్తించారు. ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించగా ఆశ్చర్యం కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి.


నేపాల్ కు చెందిన ‘‘కైలాలీ’ అనే దొంగల ముఠా పక్కా ప్లాన్ తో చోరీలు చేస్తోంది. ఇంటిలో ఇద్దరు ఉండే ఇళ్లనే టార్గెట్ చేసుకుని భార్యాభర్తలని చెప్పి ఇంటిలో పనిమనుషుల్లా చేరతారు. తరువాత అదను చూసి మొత్తం ఇంటిని దోచేస్తారు. అలా వారి ప్లాన్ లో భాగంగా..నాచారం హెచ్ ఎంటీ నగరంలో 15 రోజుల క్రితం ఓ ఇంటిలో అర్జున్ అనే 28 యువకుడు మాయ అనే 26ఏళ్ల యువతి భార్యాభర్తలమని చెప్పి పనిమనుషులుగా చేరారు.



కానీ వాళ్లు భార్యాభర్తలు కాదు ప్రియుడు ప్రియురాలు.ఆ ఇంటిలో చేరితో చక్కగా గిట్టుబాటు అవుతుందని..ఆ ఇంటిలో పని మనుషుల అవసరం ఉందని బ్రోకర్ ద్వారా ముందే తెలుసుకుని పక్కా ప్లాన్ తో చేరారు. అర్జున్ కు అప్పటికే పెళ్లి అయ్యింది. భార్య నేపాల్ లో ఉంటుంది. ప్రియురాలు మాత్రం బెంగుళూరులో ఉంటుంది. నేపాల్ నుంచి భార్యను తెచ్చుకోవటానికి చాలా టైమ్ పడుతుందని బెంగళూరులో ఉండే ప్రియురాలినే భార్య అని చెప్పి ఇంటిలో చేరాడు.


వాళ్లు ఇంటిలో చేరాక నేపాల్ నుంచి ఈ కైలాలీ ముఠా ప్రధాన సూత్రధారి గోవింద్ వచ్చి వారిద్దరినీ కలిసాడు. ఇంటిలో చోరీ ఎలా చేయాలి? ఎటువంటిసమయంలో చేయాలి? ఏమేమి చోరీ చేయాలి? అన్నీ దోచుకున్నాక ఎవరికీ చిక్కకుండా హైదరాబాద్ నుంచి నేపాల్ ఎలా చేరుకోవాలి? అనే కీలక మైన విషయాలన్నీ చెప్పి వెళ్లిపోయాడు.


ఆ తరువాత చోరీకి సరైన సమయం ఇదేనని నిర్ణయించుకున్న అర్జున్..మాయ ఇద్దరూ కలిసి ఇంటిలో ఉండే వృద్ధురాలికి ముందస్తు ప్లాన్ లో భాగంగా మత్తు మందు ఇచ్చి గత సోమవారం రాత్రి రూ.10 లక్షల నగదు 18 తులాల బంగారం, 40 తులాల వెండిని దోచేసి చెక్కేశారు.


ఈ చోరీపై రంగంలోకి దిగిన సీపీ మహేష్ భగవత్ 10 ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. కానీ అప్పటికే అర్జున్, మాయలు నేపాల్ బోర్డర్ లోకి చేరుకున్నట్లుగా గుర్తించారు. వారిని ఒకటి రెండు రోజుల్లో అరెస్ట్ చేస్తామని తెలిపారు.