TS Covid: తెలంగాణలో కొవిడ్ విజృంభణ.. భారీగా పెరిగిన కొత్త కేసులు..

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం రాష్ట్రంలో కొత్త కేసులు భారీగా నమోదయ్యాయి. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం..

TS Covid: తెలంగాణలో కొవిడ్ విజృంభణ.. భారీగా పెరిగిన కొత్త కేసులు..

Ts Covid

TS Covid: తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం రాష్ట్రంలో పాజిటివ్ కేసులు భారీగా నమోదయ్యాయి. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో నేడు మొత్తం 25,193 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 552 మంది కొవిడ్ భారిన పడ్డారు.

Ts covid-19: తెలంగాణలో పెరిగిన కొవిడ్ కేసులు.. కొత్తగా ఎన్నంటే..

తెలంగాణలో ప్రస్తుతం 4,753 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 496 మంది కొవిడ్ తో చికిత్స పొందుతూ కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.90శాతంగా ఉంది. మంగళవారం కొవిడ్ తో చికిత్స పొందుతూ ఎవరూ మరణించలేదు. ఇదిలాఉంటే తెలంగాణలో అత్యధికంగా హైదరాబాద్ లో కొత్తకేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్ లో 316 మందికి కరోనా నిర్ధారణ కాగా, రంగారెడ్డిలో 51, మేడ్చల్ జిల్లాలో 36, సంగారెడ్డి జిల్లాలో 28, ఖమ్మంలో 14, నల్గొండ జిల్లాలో 12 మంది కొత్తగా కొవిడ్ భారిన పడ్డారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు బయటకు వచ్చేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. మాస్క్ లేకుండా బయటకు వచ్చిన వారిపై జరిమానాలు సైతం విధిస్తామని ప్రభుత్వం తెలిపింది.