Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కొత్త చిక్కులు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కొత్త చిక్కులు ఏర్పడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య సయోద్య కుదిరినప్పటికీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ట్విస్ట్ నెలకొంది.

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కొత్త చిక్కులు

assembly (1)

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కొత్త చిక్కులు ఏర్పడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య సయోద్య కుదిరినప్పటికీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ట్విస్ట్ నెలకొంది. 8వ సెషన్ ను తెలంగాణ అసెంబ్లీ ప్రోరోగ్ చేయకుండా 4వ అసెంబ్లీ సమావేశాల పేరుతో ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఆర్టికల్ 173 ప్రకారం బడ్జెట్ సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అయితే 8వ సెషన్ కొనసాగితే గవర్నర్ ప్రసంగంపై అనుమానం వ్యక్తం అవుతుంది.

దీంతో 8వ సెషన్ ప్రోరోగ్ చేసి 9వ సెషన్ ప్రారంభిస్తారా? లేక 8వ సెషన్ లోనే గవర్నర్ ప్రసంగం పెడతారా? ఒకవేళ గవర్నర్ ప్రసంగం అలా పెట్టేందుకు సభా సంప్రదాయాలు అనుకూలంగా ఉంటాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఏం నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య సయోద్య కుదిరింది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడంపై సందిగ్థతకు తెర పడింది.

Telangana Assembly Governor speech : టీ.సర్కార్, గవర్నర్ మధ్య కుదిరిన సయోద్య.. గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు

బడ్జెట్ ను గవర్నర్ ఇప్పటివరకు ఆమోదించలేదంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. హైకోర్టు సూచన మేరు ఇటు ప్రభుత్వం, ఆటు రాజ్ భవన్ తరపు న్యాయవాదులు చర్చలు జరిపి ఓ పరిష్కారానికి వచ్చారు. అసెంబ్లీ సమావేశాల రాజ్యాంగ బద్ధ నిర్వహణకు నిర్ణయించుకున్నామని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తామని చెప్పారు. ఇటు రాజ్యాంగ బద్దంగా గవర్నర్ తన విధులు నిర్వహిస్తారని రాజ్ భవన్ తరుపు న్యాయవాది తెలిపారు.