Congress : హుజూరాబాద్ కాంగ్రెస్ షార్ట్ లిస్ట్ లో కొత్త పేర్లు

హుజూరాబాద్ కాంగ్రెస్ షార్ట్ లిస్ట్ లో కొత్త పేర్లు చేరాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ్మ కమిటీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు పూర్తి చేసింది.

Congress : హుజూరాబాద్ కాంగ్రెస్ షార్ట్ లిస్ట్ లో కొత్త పేర్లు

Congress

Huzurabad Congress shortlist : హుజూరాబాద్ కాంగ్రెస్ షార్ట్ లిస్ట్ లో కొత్త పేర్లు చేరాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ్మ కమిటీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు పూర్తి చేసింది. అధిష్టానానికి పంపిని నివేదికలో నలుగురి పేర్లను పేర్కొన్నారు. కృష్ణారెడ్డి, రవికుమార్(మున్నూరు కాపు), సైదులు (ఎస్సీ), ప్యాట రమేశ్ (మున్నూరు కాపు) పేర్లు ఉన్నాయి. కాంగ్రెస్ ఎల్లుండి హుజూరాబాద్ అభ్యర్థిని ప్రకటించనుంది.

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల బ‌రిలో టీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున విద్యార్థి నాయ‌కుడు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ పోటీ చేస్తున్నారు. రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీ తరుఫున పోటీ చేస్తున్నారు. కాగా తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయడంతో తన ఎమ్మెల్యే పదవికి జూన్‌ 12న ఆయన రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.

Huzurabad By Poll Schedule : హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. అక్టోబర్‌ 30న ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. నవంబర్‌ 2న కౌంటింగ్‌ చేపట్టనున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అక్టోబర్ 8వరకు నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు.

అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13గా ప్రకటించింది. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల నిర్వహించి…. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటిస్తారు.ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా షెడ్యూల్‌ను విడుదల చేసింది.