రైతు చేతిలో అస్త్రం: తెలంగాణ అసెంబ్లీలో కొత్త రెవిన్యూ బిల్లుకు ఆమోదం

  • Published By: sreehari ,Published On : September 11, 2020 / 06:09 PM IST
రైతు చేతిలో అస్త్రం: తెలంగాణ అసెంబ్లీలో కొత్త రెవిన్యూ బిల్లుకు ఆమోదం

తెలంగాణ అసెంబ్లీలో కొత్త రెవెన్యూ బిల్లుకు ఆమోదం లభించింది. ఎలాంటి సవరణలు లేకుండానే రెవెన్యూ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ పట్టాదార్ పాస్ బుక్ బిల్2020ను శాసనసభ ఆమోదించింది. మూజువాణి ఓటుతో బిల్లును శాసనసభ ఆమోదించింది. తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్ బుక్‌ల బిల్లు-2020కు ఆమోదం లభించింది.



పంచాయతీరాజ్ సవరణ-2020 బిల్లుకు సభ ఆమోదం తెలపడంతో ఇక తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మున్సిపల్ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందడంతో ఎమ్మార్వోలకే భూముల రిజిస్ట్రేషన్ బాధ్యత వహించనున్నారు.

తెలంగాణ ధరణి పోర్టల్ లోని ఇకపై రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సి ఉంటుంది. వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లుకు శాసనసభ ఆమోదించింది. రెవెన్యూ బిల్లు ఆమోదం పొందిన అనంతరం తెలంగాణ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది.



అంతకుముందు కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్స్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.దేవాదాయ, వక్ఫ్ భూములు క్రయ, విక్రయాలు రద్దు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. వక్ఫ్‌ భూముల్లో లావాదేవీలు జరగకుండా ఆటోలాక్ చేస్తామన్నారు. ఆలయ భూములను పరిరక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

77వేల ఎకరాల వక్ఫ భూముల క్రయవిక్రయాలు రద్దు చేస్తున్నట్టు చెప్పారు. రేపటి నుంచి దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్లు బంద్ చేస్తున్నట్టు తెలిపారు. ఒక్క చట్టంతో అంతా మారిపోతుందంటే అనేక అనుమానాలు వస్తాయని కేసీఆర్ తెలిపారు.



సమగ్ర భూ సర్వే తర్వాతే సమస్యలకు పరిష్కారం దొరకుతుందని అన్నారు.అటవీ భూములను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క గుంట కూడా అటవీ భూమి కబ్జా కానివ్వమన్నారు. పోడు భూములు సాగు చేసుకుంటున్నవారికి పట్టాలిస్తామన్నారు. సాదాబైనామా విషయంలో లిబరల్ గా వ్యవహరించామని చెప్పారు. జీవో 58, జీవో 59ని పొడిగించేందుకు ప్రయత్నిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.



కేబినెట్ భేటీలో చర్చించి వీటిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పేదలు సంతోషంగా ఉండాలన్నదే మా విధానమన్నారు. గతంలో భూ పంపిణీ శాస్త్రీయంగా జరగలేదన్నారు. జాగా లేకుండా ఇష్టా రాజ్యంగా సర్టిఫికేట్లు ఇచ్చారని చెప్పారు. వక్ఫ్ భూముల్లో లావాదేవీలు జరగకుండా ఆటోలాక్ చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన ఆర్ఓఎఫ్ఆర్ సర్టిఫికేట్లు పట్టా సర్టిఫికెట్లు కావన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలకు ధరణి పోర్టల్ లో ప్రత్యేక కాలమ్ ఉంటుందని తెలిపారు.