Vamanrao Murder Case : వామన్ రావు హత్యకేసులో బయటికి వస్తోన్న కొత్త విషయాలు

వామన్ రావు దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టా మధు ఎంక్వైరీలో రోజుకో విషయం బయటకు వస్తోంది.

Vamanrao Murder Case : వామన్ రావు హత్యకేసులో బయటికి వస్తోన్న కొత్త విషయాలు

Vamanrao Murder Case

Vaman Rao murder case : వామన్ రావు దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టా మధు ఎంక్వైరీలో రోజుకో విషయం బయటకు వస్తోంది. బినామీల పేరుతో వందల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్టు మంథని మాజీ సర్పంచ్‌ ఇనుముల సతీశ్‌ ఐటీ, సీబీఐ, ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్రలోనూ భారీగా పెట్టుబడులు పెట్టినట్టుగా కంప్లైంట్‌ చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో సోదరుడి పేరు మీద ఇసుక క్వారీ నడిపిస్తున్నట్టుగా ఆరోపించారు.

దుబాయ్‌, అరబ్‌ దేశాల్లోనూ పెట్టుబడులు పెట్టినట్టుగా అవన్నీ అక్రమాస్తులంటూ కంప్లైంట్‌ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన భవిత శ్రీ చిట్‌ ఫండ్స్‌లో పుట్ట మధు 50 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినట్టు.. వామన్‌రావు హత్య కేసుకు సంబంధించి రెండు కోట్ల రూపాయల సుపారీ ఇక్కడి నుంచే చెల్లించినట్లు ఫిర్యాదు చేశారు.

మరోవైపు పలు నిర్మాణ కంపెనీలకు పనులు వచ్చేలా చేసి కమిషన్‌ తీసుకున్నట్టు ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు. పెద్దపల్లి నుంచి కాటారం వరకు ఉన్న డబుల్‌ రోడ్డును 9 మీటర్ల విస్తరణకు అప్పట్లో సీఎం కేసీఆర్‌కు పుట్ట మధు లేఖ రాశారు. ఈ పనులు దక్కించుకున్న ఆర్‌ అండ్‌ బీ కాంట్రాక్టర్ల నుంచి కమిషనర్ తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

వామన్‌రావు హత్య కేసులో పుట్ట మధుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో భాగంగా పుట్ట మధు భార్య శైలజ రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌కు వచ్చారు. అయితే నంబర్‌ ప్లేట్‌ లేని వాహనంలో రావడం చర్చనీయాంశంగా మారింది.