Hyderabad : ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి అప్పుడే పుట్టిన శిశువు బలి

బిడ్డ జన్మిoచిన తాలూకు పేపర్లను K.A.M సిబ్బంది చించివేశారు. బంధువులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ ముందు తల్లిదండ్రులు, బంధువులు నిరసనకు దిగారు.

Hyderabad : ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి అప్పుడే పుట్టిన శిశువు బలి

Baby Died

Newborn baby killed : హైదరాబాద్ ఫాలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని షాంశీరగంజ్ ప్రాంతంలో K.A.M హాస్పిటల్ లో దారుణం జరిగింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పండంటి బిడ్డ మృతి చెందింది. ఖైరతాబాద్ చింతల్ బస్తి ప్రాంతానికి చెందిన సోఫియా బేగం K.A.M హాస్పిటల్ లో ఈరోజు ఉదయం మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇది ఆమెకు రెండో కాన్పు. బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నాడని కుటుంబ సభ్యులకు డాక్టర్స్ తెలిపారు.

అయితే కొద్దీ సేపటి తర్వాత బిడ్డ శ్వాస సమస్యతో బాధ పాడుతున్నాడని K.A.M సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. తల్లితండ్రులకు అనుమానం రావడంతో బంధువులు డాక్టర్లను గట్టిగా నిలదీశారు. బాబును ఒక గుడ్డలో చుట్టి K.A.M సిబ్బంది తల్లితండ్రులకు అప్పగించింది. అనుమానం వచ్చి చూడగా బిడ్డ విగత జీవిగా ఉన్నాడు. బిడ్డ ఒంటిపై కాలిన గాయాలు ఉన్నాయి.

Nalgonda : ఆపరేషన్ తర్వాత దూది, వేస్ట్‌క్లాత్‌ను మహిళ కడుపులోనే పెట్టి కుట్టేసిన డాక్టర్లు

బిడ్డ జన్మిoచిన తాలూకు పేపర్లను K.A.M సిబ్బంది చించివేశారు. బంధువులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ ముందు తల్లిదండ్రులు, బంధువులు నిరసనకు దిగారు. బాధిత ఫ్యామిలీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫలక్ నుమా పోలీసులు కేసు నమోదు చేసుకొని, విచారిస్తున్నారు.