NGT Fined Telangana : తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‪జీటీ బిగ్ షాక్.. రూ.3,800 కోట్ల జరిమానా, 2 నెలలే గడువు

తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‪జీటీ(నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌) భారీ షాక్ ఇచ్చింది. ఏకంగా రూ.3వేల 800 కోట్ల భారీ జరిమానా విధించింది. వ్యర్థాల నిర్వహణలో మార్గదర్శకాలను, గతంలో తీర్పులను అమలు చేయకపోవడంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

NGT Fined Telangana : తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‪జీటీ బిగ్ షాక్.. రూ.3,800 కోట్ల జరిమానా, 2 నెలలే గడువు

NGT Fined Telangana : తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‪జీటీ(నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌) భారీ షాక్ ఇచ్చింది. ఏకంగా రూ.3వేల 800 కోట్ల భారీ జరిమానా విధించింది. వ్యర్థాల నిర్వహణలో మార్గదర్శకాలను పాటించకపోవడం, గతంలో తీర్పులను అమలు చేయకపోవడంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు నెలల్లో 3వేల 800 కోట్ల రూపాయలు ప్రత్యేక అకౌంట్ లో డిపాజిట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. వ్యర్థాల నిర్వహణకు సత్వర చర్యలు చేపట్టి పురోగతిని తెలియజేయాలని తెలంగాణ సర్కార్ కు ఆదేశాలు జారీ చేసింది ఎన్జీటీ.

మున్సిపాలిటీల్లో పారిశుద్ధ వ్యవహారాల నిర్వహణ సరిగాలేదంటూ 1996లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పర్యావరణ సురక్ష అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు తదనంతర కాలంలో ఎన్జీటీకి బదిలీ చేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఎన్జీటీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు పంపింది. తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కు కూడా నోటీసులు పంపగా, ఆయన ఇచ్చిన వివరణ పట్ల ఎన్జీటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే వేల కోట్ల భారీ జరిమానా విధించింది. రెండు నెలల్లో ఈ జరిమానా మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో జమ చేయాలని ట్రైబ్యునల్ ఆదేశించింది. అంతేకాదు, వ్యర్థాల నిర్వహణకు చర్యలు చేపట్టాలని, వాటికి సంబంధించిన పురోగతిని తమకు నివేదించాలని కూడా తన ఆదేశాల్లో పేర్కొంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇదే అంశంలో గత కొన్ని వారాల్లో ఎన్జీటీ పలు రాష్ట్రాలకు భారీ జరిమానాలు విధించింది. వ్యర్థ పదార్థాల నిర్వహణ విధానాల అమలులో విఫలమయ్యారంటూ మహారాష్ట్రకు రూ.12 వేల కోట్లు, పశ్చిమ బెంగాల్ కు రూ.3,500 కోట్లు, రాజస్థాన్ కు రూ.3 వేల కోట్లు, పంజాబ్ కు రూ.2,080 కోట్ల జరిమానా విధించింది.

ఇటీవలే.. పంజాబ్‌ ప్రభుత్వంపైనా ఎన్జీటీ కొరడా ఝలిపించింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను పెద్దమొత్తంలో జరిమానా విధించింది. రాష్ట్రాల్లో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబధనలు, నీటి చట్టాల అమలును ఎన్జీటీ 2018 నుంచి పర్యవేక్షిస్తున్నది. మున్సిపల్‌ వ్యర్థాల నిర్వహణ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ రూ.2,080 కోట్లు ఫైన్‌ వేసింది.

గత మూడు వారాల్లో మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, రాజస్తాన్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్జీటీ జరిమానా విధించింది. వ్యర్థ పదార్థాల నిర్వహణ విధానాలను అమలు చేయడంలో విఫలమైనందుకు రాజస్తాన్ ప్రభుత్వానికి రూ.3వేల కోట్లు, పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించడంతో మహారాష్ట్రపై రూ.12 వేల కోట్లు, వెస్ట్ బెంగాల్‌ ప్రభుత్వానికి రూ.3,500 కోట్ల జరిమానా విధించింది ఎన్జీటీ.