Weather Report: తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు

తెలంగాణ రాష్ట్రంలో వేడి తీవ్రత పెరుగుతుంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో పగలు ఎండ, వేడిగాలుల తీవ్రత అధికంగా ఉండగా.. రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.

Weather Report: తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు

Temperatures

Weather Report: తెలంగాణ రాష్ట్రంలో వేడి తీవ్రత పెరుగుతుంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో పగలు ఎండ, వేడిగాలుల తీవ్రత అధికంగా ఉండగా.. రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో రాత్రి వేళ 24 నుంచి 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. రానున్న రోజుల్లో 28 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంటుందని వాతావరణ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం నిజామాబాదులో అత్యధికంగా 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఆదిలాబాద్ లో 40 డిగ్రీలు, మెదక్ జిల్లాలో 40 డిగ్రీలు, మహబూబ్ నగర్ జిల్లాలో 39 డిగ్రీలు, హైదరాబాద్ లో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.

Also Read:Bhoiguda Fire Accident: బోయిగూడ అగ్నిప్రమాదానికి కారణం కనిపెట్టిన అధికారులు

విదర్భ నుంచి కర్ణాటక మీదుగా శ్రీలంక సరిహద్దు వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఎండా వేడి గాలు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నగరాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ఎండల నుంచి రక్షణగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.

Also read:Chittoor : నిశ్చితార్థం సంబరాల్లో విషాదం.. 50 అడుగుల లోతులో పడిన బస్సు, మృతుల వివరాలు