తెలంగాణాలో కర్ఫ్యూ ..7 PM To 6 AM

  • Published By: madhu ,Published On : March 24, 2020 / 02:45 PM IST
తెలంగాణాలో కర్ఫ్యూ ..7 PM To 6 AM

తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారిని ప్రారదోలడానికి కేసీఆర్ సర్కార్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ రాష్ట్ర ప్రజలు దీనిని పట్టించుకోకుండా రోడ్లపైకి రావడంతో సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు.

ఇదే విధంగా వ్యవహరిస్తే..మాత్రం తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ప్రజలు సహకరించకపోతే…24 గంటల పాటు కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రతి రోజు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాష్ట్రంలో కర్ఫ్యూ  అమల్లో ఉంటుందని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు సీఎం కేసీఆర్. 

పోలీసు డిపార్ట్ మెంట్, వైద్యును ఎక్కువగా ఇబ్బంది పెట్టవద్దన్నారు. దేశం మొత్తం స్తంభించిపోయిందన్న ఆయన..30 రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయన్నారు. వ్యాధి కొత్తగా రాదు..ఇప్పుడు వ్యాధి వ్యాప్తి చెందకుండా…కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనిని ఇలాగే కొనసాగిస్తే..రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చన్నారు. స్వీయ నియంత్రణ కంపల్సరీ అని మరోసారి స్పష్టం చేశారాయన. 

* లేబర్ ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు. 
* చాలా గ్రామాలు కంచెలు ఏర్పాటు చేసుకున్నాయి. మంచి పరిణామం. 

* షిప్ట్ ల వారీగా విధులు (పోలీసులు, వైద్యులు) చేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చాం. 
* ఆరోగ్య శాఖకు ఎలాంటి పరిస్థితుల్లో నిధుల కొరత రావొద్దని చెప్పాం. 

* పోలీసుల విధుల నిర్వాహణకు కూడా నిధులు విడుదల చేయాలని చెప్పాం. 
* వాహనాలు రోడ్లపైకి వస్తే పెట్రోల్ బంకులు మూసివేస్తాం.