Medico Student Preeti : అత్యంత విషమంగా మెడికో విద్యార్థి ప్రీతి ఆరోగ్యం.. ఎక్మోపై చికిత్స, వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస

మెడికో విద్యార్థి ప్రీతి ఆరోగ్యం రోజు రోజుకూ మరింత క్షీణిస్తోంది. ఇప్పటివరకు ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉందని నిమ్స్ వైద్యులు అంటున్నారు. ఎక్మోపై చికిత్స అందిస్తూ వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నారు.

Medico Student Preeti : అత్యంత విషమంగా మెడికో విద్యార్థి ప్రీతి ఆరోగ్యం.. ఎక్మోపై చికిత్స, వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస

preeti

Medico Student Preeti : మెడికో విద్యార్థి ప్రీతి ఆరోగ్యం రోజు రోజుకూ మరింత క్షీణిస్తోంది. ఇప్పటివరకు ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉందని నిమ్స్ వైద్యులు అంటున్నారు. ఎక్మోపై చికిత్స అందిస్తూ వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. కిడ్నీలు ఫెయిలవ్వడంతో డియాలసిస్ పై కిడ్నీ ఫంక్షనింగ్ కొనసాగిస్తున్నారు. మెడికల్ ప్రోటోకాల్ ప్రకారం ప్రీతికి చికిత్స అందిస్తున్నట్లు నిమ్స్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ప్రముఖులు ఎందరో ప్రీతిని పరామర్శించి ఆమె పేరెంట్స్ కు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. నిమ్స్ ఆస్పత్రి స్పెషలిస్ట్ డాక్టర్లు, మల్టీ డిసిప్లినరీ బృందం ఆమెకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

మెడికో విద్యార్థి ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రీతిని కాపాడేందుకు నిమ్స్ వైద్యులు శత విధాలు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఎక్మో సపోర్టుతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు నిమ్స్ వైద్య బృందం హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ పరిస్థితిలో ఉన్న ప్రీతిని నిమ్స్ కు తీసుకొచ్చారని వైద్యులు చెప్పారు. 72 గంటలు గడిస్తే కానీ క్లారిటీ రాదని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ప్రీతి ఇప్పటివరకు ఆరు సార్లు ఆగిపోయింది.

Medico Preethi : పూర్తిగా చెడిపోయిన కిడ్నీలు, అత్యంత విషమంగా ప్రీతి పరిస్థితి

ఎంజీఎంలో ఒకసారి గుండె ఆగిపోగా, నిమ్స్ లో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు గుండె ఆగిపోయింది. వైద్యులు వెంటనే అలర్టై సీపీఆర్ చేయడంతో పెద్ద గండం తప్పింది. గత ఐదు రోజులుగా ఆర్సీయూ, వెంటిలేటర్, ఎక్మో యంత్రం సాయంతో ప్రత్యేక వైద్య బృందం చికిత్స చేస్తోంది. పీజీ వైద్య విద్యార్థిని ప్రీతికి స్పెషలిస్టు డాక్టర్లు, మల్టీ డిసిప్లినరీ టీమ్ పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. ప్రస్తుతం ఎక్మో, వెంటిలేటర్ పై ట్రీట్ మెంట్ కొనసాగుతోంది.

మరోవైపు ప్రీతి కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో డయాలసిస్ కొనసాగుతోంది. మెడికల్ నిబంధనల ప్రకారం.. ఎవరైనా పేషెంట్ కు ఎక్మోపై వైద్యం అందిస్తే కనీసం 72 గంటల వరకు ట్రీట్ మెంట్ అందిచాల్సివుంటుంది. అప్పటికీ బాడీ రెస్పాండ్ అవ్వకపోతే పేరెంట్స్ ను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి డిక్లరేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రీతి వైటల్స్ మొత్తం పడిపోయాయి. బీపీ కూడా మెయింటెన్ అవ్వడం లేదని వైద్యులు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు.