Nirmal Singh : నిజాం పాలనను తలపిస్తున్న కేసీఆర్ పాలన : నిర్మల్ సింగ్
తాను రైతు బిడ్డనని, కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆరోగ్య పరిరక్షణ కోసం ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చామని తెలిపారు.

Nirmal Singh
Nirmal Singh criticized KCR : కేసీఆర్ పాలన నిజాం పాలనను తలపిస్తుందని జమ్ముకాశ్మీర్ మాజీ ఉప ముఖ్య మంత్రి నిర్మల్ సింగ్ విమర్శించారు. ఎన్నికల హమీలను విస్మరించి.. ప్రజలను కేసీఆర్ మోసం చేశారనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో అందరూ ఉద్యోగస్తులేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. 9 సంవత్సరాలలో కేసీఆర్ ఏం చేసాడో చెప్పాలని డిమాండ్ చేశారు.
పేదలకు ఇళ్ళు…. ఆవాస్ యోజన ద్వారా కేంద్రం ఇచ్చే నిధులను డబల్ బెడ్ రూం ద్వారా తన పథకంగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం G-20 సమ్మిట్ నిర్వహించిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కాశ్మీర్ పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు గతంలో ఎప్పుడూ అమలు కాలేదని తెలిపారు.
ఈ మేరకు గురువారం ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజల ముందు పెడదామని చెప్పారు. అన్ని రంగాల్లో దేశం ముందుకు పోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో వేలాది కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. రూ.12 వేల కోట్లతో రోడ్లు అభివృద్ధి, రైతుల కోసం మార్కెట్ ను సరళతరం చేశారని వెల్లడించారు.
తాను రైతు బిడ్డనని, కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆరోగ్య పరిరక్షణ కోసం ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చామని తెలిపారు. జమ్మూలో అబ్దుల్లా కుటుంబ పాలన సాగిందన్నారు. 370 ఆర్టికల్ ద్వారా మారిన పరిస్థితుల వలన పరిశ్రమల స్థాపనకు వస్తున్నారని తెలిపారు. ఖమ్మంలో పరిశ్రమలు ఏవని ప్రశ్నించారు.
కరోనా సమయంలో కేంద్రం ఉచితంగా వ్యాక్సినేషన్ వేయడం వలన కోట్లాది మందిని కాపాడుకోగలిగామని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా విలవిలలాడాయని చెప్పారు. తెలంగాణలో బీజేపీ బలపడింది… బలపడుతోందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ కట్టుబడి ఉందన్నారు.