NIV Pune : తెలంగాణలో DENV-2 డెంగీ స్ట్రెయిన్, లక్షణాలు ఇవే

తెలంగాణలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టిందో లేదో.. డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పట్టణాలు మొదలు గ్రామాల వరకు దడ పుట్టిస్తోంది.

NIV Pune : తెలంగాణలో DENV-2 డెంగీ స్ట్రెయిన్, లక్షణాలు ఇవే

Health

Dengue Cases : తెలంగాణలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టిందో లేదో.. డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పట్టణాలు మొదలు గ్రామాల వరకు దడ పుట్టిస్తోంది. ఇదే సమయంలో  పుణె పరిశోధకుల అధ్యయనం ఫలితాలు మరింత భయపెడుతున్నాయి. తెలంగాణలో డెన్వ్‌-2 అనే డెంగీ స్ట్రెయిన్‌ తీవ్రంగా ఉన్నట్లు పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధకుల స్టడీలో తేలింది.డెన్వ్-2 … డెంగీ వైరస్‌లో ఉన్న నాలుగు విభిన్న స్ట్రెయిన్స్‌లో ఒకటి. చాలా డేంజరస్‌ స్ట్రెయిన్‌.

Read More : PM Modi’s Flight : రూటు మార్చిన మోదీ ఫ్లైట్..పాక్ గగనతలం మీదుగా

ఇది ఒక్కసారి బాడీలోకి ఎంటరైతే ప్లేట్‌లెట్‌ కౌంట్‌ను తగ్గించేస్తుంది. చర్మం నుంచి రక్తస్రావం వంటి తీవ్రమైన పరిస్థితులకు దారితీసేలా చేస్తుంది. వాంతులు అవడం, ఎరుపు రంగులో దద్దులు రావడం, శరీరం వణకడం, అసౌకర్యంగా ఉన్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే.. అదే డెన్వ్ -2 స్ట్రెయిన్ ఇపుడు తెలంగాణలో తన ప్రభావం చూపిస్తోంది.2018 నుంచి తెలంగాణలో సేకరించిన నమూనాల్లో దాదాపు 34 శాతం డెన్వ్‌-2 ఉన్నట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ తేల్చింది.

Read More : Gujarat Man : వ్యాక్సిన్..వ్యాక్సిన్..యువకుడి వినూత్న ప్రమోషన్

తెలంగాణలోనే కాదు.. ఏపీ, గుజరాత్, జార్ఖండ్, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లోను డెన్వ్‌-2 ఉన్నట్లు గుర్తించింది. దేశవ్యాప్తంగా  మొత్తం 4వేల 963 నమూనాలను అధ్యయనం చేయగా… డెన్వ్‌-2 తో సహా నాలుగు రకాల డెంగీ స్ట్రెయిన్లు ఉన్నట్లు తేలింది. వీటిద్వారా ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోవడంతోపాటు, కడుపునొప్పి వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు కనుగొంది. డెన్వ్‌-2 స్ట్రెయిన్‌ సోకినా లక్షణాలు అంత తొందరగా బయటపడకపోవచ్చు. అయితే అలాంటి సందర్భాలు చాలా తక్కువ. కానీ.. సరైన చికిత్స అందించకపోతే బాధితులు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే.. తెలంగాణలోని డెంగ్యూ పట్ల అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు హెల్త్‌ ఎక్స్‌పర్ట్స్.