కాళేశ్వరం నీళ్లతోనే నా పంట పండింది..కేసీఆర్ మక్క పంట

  • Published By: madhu ,Published On : August 31, 2020 / 06:45 AM IST
కాళేశ్వరం నీళ్లతోనే నా పంట పండింది..కేసీఆర్ మక్క పంట

కాళేశ్వరం నీళ్లతోనే నా పంట పండింది..కేసీఆర్ మక్క పంట
కాళేశ్వరం నీళ్లతోనే నా పంట పండింది..బోరు నీళ్లతో పండింది కాదు..కేసీఆర్ వరద కాలువ నీళ్లతో తాను వేసిన మక్క పంట పండిందని..ఇది కేసీఆర్ మక్క పంట అంటూ ఓ రైతు చెబుతున్నాడు. సోషల్ మీడియాలో ఈ రైతుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.



నిజామబాద్ జిల్లాలోని బాల్కొండలో సంబరాలు నెలకొన్నాయి. ఎన్నడూ లేని విధంగా..ఈసారి వరద కాల్వ ద్వారా ఎదురెక్కిన కాళేశ్వరం జలాలు జగిత్యాల జిల్లాతో పాటు నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని 16 గ్రామాలకు సాగుకు పండుగను తీసుకొచ్చిందంటున్నారు రైతులు. వరద కాలువలోకి ఒక టీఎంసీ కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయడంతో ఎదురెక్కిన గోదావరి జలాలు ఎస్సారెస్పీ దిగువ ఉన్న భూములను తడిపాయి.

రైతు ఏమంటున్నాడంటే…
కరోనా కారణంగా…చాలా మంది పట్టణాలను వదిలి సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. అలాగే..హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటున్న బాల్కొండకు చెందిన కొంతమంది వారి వారి స్వస్థలాలకు వెళ్లారు. పొలాల గట్లపై వెళ్తున్నారు. వన్నెల్‌(బి) గ్రామ శివారులో రైతు కిషన్ ఎదురువచ్చాడు. ఆయన్ను కాసేపు పలకరించారు.



పంటలు ఎలా పండుతున్నాయని, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై పలు ప్రశ్నలు అడిగారు. కేసీఆర్‌ వరద కాలువ నీళ్లతో పండిన పంట అని చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. బోరు నీళ్లతో పండింది కాదు. వంద శాతం. మక్కంతా కేసీఆర్‌ నీళ్లతో పండిన పంట అని చెప్పాడు రైతు. కేసీఆర్‌ మక్కంటూ ఫేస్‌బుక్‌లో పెట్టు అని చెప్పి ఆ రైతు వెళ్లిపోయాడు. ఆ యువకులు సరదాగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో హల్‌చల్‌ అయింది.