MLC Kavitha : వచ్చే ఏడాది నుంచి కోలాట పోటీలు : ఎమ్మెల్సీ కవిత

ధర్మపురి స్ఫూర్తిగా వచ్చే ఏడాది నుంచి బతుకమ్మ, దసరా నవరాత్రి ఉత్సవాల్లో రాష్ట్రవ్యాప్తంగా కోలాట పోటీ లు నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.

MLC Kavitha : వచ్చే ఏడాది నుంచి కోలాట పోటీలు : ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha : ధర్మపురి స్ఫూర్తిగా వచ్చే ఏడాది నుంచి బతుకమ్మ, దసరా నవరాత్రి ఉత్సవాల్లో రాష్ట్రవ్యాప్తంగా కోలాట పోటీ లు నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం, ఎల్‌ఎం కొప్పుల ట్రస్టు సంయుక్తంగా నిర్వహించిన బతుకమ్మ, దసరా కో లాట పోటీల ముగింపు, బతుకమ్మ వేడుకలను జగిత్యాల జిల్లా ధర్మపురి జూనియర్‌ కాలేజీ మైదానంలో గురువారం రాత్రి నిర్వహించారు.

Bathukamma : ఢిల్లీలో బతుకమ్మ సంబరాలు

మహిళల కేరింతలు, కోలాటాల మధ్య సంబురాలు అం గరంగ వైభవంగా సాగాయి. కార్యక్రమం లో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ వొద్దినేని హరి చరణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.