BJP Office Nano Car : పోలీసులను, బీజేపీ నేతలను హడలెత్తించిన నానో కారు.. అసలు విషయం తెలిసి షాక్

హైదరాబాద్ లో బీజేపీ ఆఫీస్ ముందు అనుమానాస్పదంగా పార్క్ చేసిన నానో కారు కలకలం రేపిన సంగతి తెలిసిందే. బీజేపీ నేతలను, పోలీసులను ఈ కారు హడలెత్తించింది. కారులో బాంబులు ఉన్నాయేమో అనే అనుమానం టెన్షన్ పెట్టించింది. రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ కారులో సోదాలు జరిపింది. అందులో బాంబులు లేవని తేల్చింది. కారులోని సూట్ కేసులో బట్టలు ఉన్నట్లు తేల్చారు.

BJP Office Nano Car : పోలీసులను, బీజేపీ నేతలను హడలెత్తించిన నానో కారు.. అసలు విషయం తెలిసి షాక్

BJP Office Nano Car : హైదరాబాద్ లో బీజేపీ ఆఫీస్ ముందు అనుమానాస్పదంగా పార్క్ చేసిన నానో కారు కలకలం రేపిన సంగతి తెలిసిందే. బీజేపీ నేతలను, పోలీసులను ఈ కారు హడలెత్తించింది. కారులో బాంబులు ఉన్నాయేమో అనే అనుమానం టెన్షన్ పెట్టించింది. రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ కారులో సోదాలు జరిపింది. అందులో బాంబులు లేవని తేల్చింది. కారులోని సూట్ కేసులో బట్టలు ఉన్నట్లు తేల్చారు.

కారులో బాంబు లేదని తేలడంతో పోలీసులు, బీజేపీ నేతలు ఊపిరిపీల్చుకున్నారు. కారుని, దాని ఓనర్ ను అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించారు పోలీసులు. తన ఇంట్లో పార్కింగ్ సౌకర్యం లేదని అందుకే బీజేపీ ఆఫీస్ ముందు కారుని పార్క్ చేశానని కారు ఓవర్ చెప్పారు. అంతేకాదు, అప్పుడప్పుడు తాను ఇలానే తన కారుని బీజేపీ ఆఫీస్ ముందు పార్క్ చేస్తానని కారు ఓనర్ చెప్పడం గమనార్హం.

అయితే, ఇందులో కుట్రకోణం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. నానో కారు రెండు రోజులుగా బీజేపీ ఆఫీస్ ముందే ఉంది. అది కూడా మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ తో ఉండటం, కారులో సూట్ కేసు ఉండటంతో బీజేపీ ఆఫీసు సిబ్బంది, స్థానికులు కంగారుపడ్డారు. అబిడ్స్ పోలీసులకు బీజేపీ నేతలు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన బాంబు స్వ్కాడ్ కారులో బాంబు లేదని తేల్చడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో దేశంలోని పలు నగరాల్లో ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. నిఘా పెంచారు. ఈ క్రమంలో బీజేపీ ఆఫీస్ ముందు అనుమానాస్పదంగా కారు పార్క్ చేసి ఉండటం, అందులో సూట్ కేసు ఉండటం తీవ్ర కలకలం రేపింది.

హైదరాబాద్‌ నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు నానో కారు కలకలం రేపింది. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఆ కారు రెండు రోజులుగా బీజేపీ ఆఫీసు ఎదుటే పార్క్ చేసి ఉంది. ఆ కారు పార్టీకి చెందిన వారిదై ఉండొచ్చని కార్యకర్తలు, నేతలు భావిస్తూ వచ్చారు. అయితే ఎవరిని ఆరా తీసినా ఆ కారు తమది కాదని చెబుతుండటంతో బీజేపీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. పైగా కారులో సూట్ కేసు కూడా ఉంది. అంతే ఒక్కసారిగా కలవరం మొదలైంది. దీని వెనుక ఏదైనా కుట్ర ఉండొచ్చన్న అనుమానంతో బీజేపీ ఆఫీస్ సిబ్బంది మంగళవారం అబిడ్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కారును క్షుణ్ణంగా పరిశీలించారు. కారు లోపల సూట్‌కేసు ఉండటంతో దాన్ని బయటకు తీసి బాంబ్ స్వ్కాడ్ తో తనిఖీ చేశారు. అందులో బాంబు లేదని బట్టలు మాత్రమే ఉన్నాయని నిర్ధారణ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ కారు ఎవరిది, అక్కడ ఎందుకు పార్క్ చేశారు అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు నంబర్ ఆధారంగా ఎంక్వైరీ చేయగా జువాద్ యర్ జంగ్ అనే వ్యక్తిదిగా తేలింది. పోలీసులు అతడికి ఫోన్ చేసి అక్కడికి రప్పించి ఆరా తీశారు. తన ఇంటి వద్ద పార్కింగ్ కు ప్లేస్ లేకపోవడంతోనే బీజేపీ ఆఫీస్ ముందు తన కారుని పార్క్ చేసినట్లు అతడు తాపీగా పోలీసులకు చెప్పడం అందరినీ విస్మయానికి గురి చేసింది.