No Vaccine No Salary : వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతాలు..లేదంటే ఇచ్చేదే లేదు : TSCAB

తమ ఉద్యోగులంతా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతాలు ఇస్తామని..లేదంటే ఇచ్చేదే లేదని తెలంగాణ స్టేట్ కోఆప‌రేటివ్ అపెక్స్ బ్యాంక్‌ ఎండీ స్పష్టంచేశారు.

No Vaccine No Salary : వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతాలు..లేదంటే ఇచ్చేదే లేదు : TSCAB

No Vaccine No Salary

No Vaccine No Salary : వ్యాక్సిన్ వేయించుకుంటేనే జీతాలు లేకుంటే ఇచ్చేదే లేదని వార్తలు ఇటీవల కాలంలో చూస్తున్నాం. అదే బాటలో పయనిస్తోంది తెలంగాణ స్టేట్ కోఆప‌రేటివ్ అపెక్స్ బ్యాంక్‌(TSCAB). ఉద్యోగులంతా వ్యాక్సిన్ వేయించుకుని తీరాలని..కనీసం ఒక డోసు వ్యాక్సిన్ అయినా తీసుకోవాలని స్పష్టంచేసింది. అలా వ్యాక్సిన్ వేయించుకుంటేనే జీతాలు ఇస్తామని లేకుంటే ఇచ్చేదే లేదని తెలిపింది. క‌రోనా టీకా తీసుకోనివారికి జీతాలు ఇచ్చే ప్ర‌స‌క్తే లేద‌ని అపెక్స్ బ్యాంక్ అధికారులు స్ప‌ష్టంగా తెలిపారు. ఈ నిర్ణ‌యం డిసెంబ‌ర్ 4, 2021 నుంచి అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ..ఈ నిబంధ‌న టీఎస్ సీఏబీ హెడ్ క్వార్ట‌ర్స్‌తో పాటు అన్ని బ్రాంచ్‌ల‌కు వ‌ర్తిస్తుంద‌ని స్పష్టంచేశారు.

Read more : No Vaccine No Salary: వ్యాక్సిన్ వేయించుకోకపోతే జీతాలివ్వం: కలెక్టర్ ఉత్తర్వులు

ఈ నిర్ణయం తీసుకుంటు ప్రకటించిన సంద‌ర్భంగా టీఎస్ సీఏబీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ నేతి ముర‌ళీధ‌ర్ మాట్లాడుతు..‘‘కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ప్ర‌తి ఉద్యోగి త‌మ వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్‌ను త‌ప్ప‌కుండా సంబంధిత వ‌ర్గాల‌కు రిపోర్ట్ చేయాల‌ని సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్న‌ట్టు స‌ర్టిఫికెట్ ఉంటేనే డిసెంబ‌ర్ జీతాలు ఉద్యోగుల ఖాతాల్లో జ‌మ అవుతాయ‌ని..లేదంటే జీతం వేసేది లేదని తెలిపారు.

Read more : covid-19 వ్యాక్సిన్‌ వేయించుకున్న యువతి..రూ 7.4 కోట్లు గెలుచుకుంది..!!

ఒక వేళ వ్యాక్సిన్ తీసుకోకుంటే..దానికి సంబంధించిన కారణాలు కచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుందని..దానికి సంబంధించి రిపోర్ట్ ఇవ్వాల‌ని తెలిపారు. ఈ రిపోర్టుల‌ను డిసెంబ‌ర్ 15లోపు సంబంధిత అధికారుల‌కు స‌మ‌ర్పించాల‌ని స్పష్టంచేశారు. 100 శాతం వ్యాక్సినేష‌న్‌కు ప్ర‌తి ఉద్యోగి స‌హ‌క‌రించాల‌ని ఈ సందర్భంగా ఎండీ నేతి ముర‌ళీధ‌ర్ ఉద్యోగులందరిని కోరారు.