Statue Of Equality : ముచ్చింతల్‌‌కు వెళుతున్నారా ? అయితే మీ కోసమే

నాలుగు రోజుల పాటు ఆరాధనా సౌకర్యానికి సందర్శకులకు ప్రవేశం లేదని వెల్లడించింది. ఏప్రిల్‌ 2 ఉగాది నూతన సంవత్సర శోభతో, సమతామూర్తి, సువర్ణమూర్తి, దివ్యదేశ సందర్శనం తిరిగి ప్రారంభం..

Statue Of Equality : ముచ్చింతల్‌‌కు వెళుతున్నారా ? అయితే మీ కోసమే

Samatha

Samatha  Murthy : ముచ్చింతల్ లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భారీ ఎత్తులో ఉన్న సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకొనేందుకు ఎక్కడి నుంచో ముచ్చింతల్ కు వస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందడంతో అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగాకుండా ఉండేందుకు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. ఈ కేంద్రంలో 2022, మార్చి 29వ తేదీ నుంచి మండల అభిషేకాలు, ఆరాధనలు జరుగుతాయని వెల్లడించింది. ఈ రోజుల్లో సందర్శకులకు ఆళయ ప్రవేశం ఉండదని పేర్కొంది.

Read More : Sri Ramanujacharyulu : సమతామూర్తి దర్శనానికి భక్తులకు అనుమతి

ఈ మేరకు 2022, మార్చి 28వ తేదీ ఓ ప్రకటన విడుదల చేసింది. మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 1 వరకు నాలుగు రోజుల పాటు ఆరాధనా సౌకర్యానికి సందర్శకులకు ప్రవేశం లేదని వెల్లడించింది. ఏప్రిల్‌ 2 ఉగాది నూతన సంవత్సర శోభతో, సమతామూర్తి, సువర్ణమూర్తి, దివ్యదేశ సందర్శనం తిరిగి ప్రారంభం కానుందని వెల్లడించింది. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శన సమయం ఉంటుందని, యధావిధిగా ప్రతి బుధవారం సెలవుంటుందని తెలిపింది. ప్రవేశ రుసుములో ఎలాంటి మార్పు చేయదేని, సెల్‌ఫోన్‌, కెమెరాలు మొదలైన ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అనుమతి ఉండదని మరోసారి స్పష్టం చేసింది. దర్శనానికి వచ్చే వారందరూ సంప్రదాయ వస్త్రాలతో రావాలని భక్తులకు సూచించింది.

Read More : Statue Of Equality :108 దివ్యక్షేత్రాలు సందర్శిస్తే.. ప్రపంచాన్ని చుట్టేసినట్లే, సమతామూర్తి క్షేత్రంలోకి 2 గంటలు అనుమతి

భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు ఇటీవలే నిర్వహించిన సంగతి తెలిసిందే. శంషాబాద్ ముచ్చింతల్ లోని ఆధ్యాత్మిక కేంద్రం ఇందుకు వేదిక అయ్యింది. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు భగవత్ శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు జరిగాయి. ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించగా.. వేడుకల ముగింపు రోజు ఫిబ్రవరి 14న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లతో పాటు విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ముచ్చింతల ఆశ్రమంలో దాదాపు 200 ఎకరాలకు పైగా స్థలంలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని నిర్మించారు. 216 అడుగుల పంచలోహ సమతామూర్తి విగ్రహం కూడా ఉంది. మొత్తం 12 రోజుల పాటు సహస్రాబ్ది వేడుకలు నభూతో నభవిష్యత్ అనే విధంగా జరిగాయి. 1035 హోమ గుండాలతో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు నిర్వహించారు.