No lockdown: పరిస్థితి అదుపులోనే ఉంది.. లాక్‌డౌన్ అవసర్లేదు

కొవిడ్-19 కేసులు తీవ్రత ఎక్కువగానే ఉన్నా పరిస్థితి అదుపులోనే ఉందని చెప్తున్నారు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి. సోమవారం మధ్యాహ్నం జరిగిన కేబినెట్ భేటీలో కరోనా మహమ్మారి, ఇతర అంశాలపై చర్చ

No lockdown: పరిస్థితి అదుపులోనే ఉంది.. లాక్‌డౌన్ అవసర్లేదు

Corona in Telangana

No lockdown: కొవిడ్-19 కేసులు తీవ్రత ఎక్కువగానే ఉన్నా పరిస్థితి అదుపులోనే ఉందని చెప్తున్నారు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి. సోమవారం మధ్యాహ్నం జరిగిన కేబినెట్ భేటీలో కరోనా మహమ్మారి, ఇతర అంశాలపై చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ అధికారిక నివాసంలో ఈ మీటింగ్ జరిగింది.

తెలంగాణలో ఆదివారం 2వేల 47కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి మొత్తం రాష్ట్రంలో 22వేల 48వేల యాక్టివ్ కేసులు ఉన్నట్లు తేలిసింది. వారం రోజుల్లోనే కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అన్ని విద్యాసంస్థలకు సెలవు రోజులు పొడిగించింది ప్రభుత్వం.

ఈ మీటింగ్ తర్వాత సీఎం ఆఫీస్ నుంచి చేసిన ట్వీట్లలో హెల్త్ మినిష్టర్ ను కోట్ చేస్తూ.. సిచ్యుయేషన్ అదుపులోనే ఉంది. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ట్వీట్ చేశారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి తగినన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముందుగా చెప్పినట్లు పాక్షిక లాక్‌డౌన్ ఆలోచనలు కూడా లేవని తెలుస్తోంది.

Lockdown:లాక్‌డౌన్‌పై నిర్ణయం రాష్ట్రాలదే.. కేంద్రం ఆలోచన ఏంటంటే?

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి శనివారం కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం తేలికపాటి లక్షణాలు ఉన్న ఆయన ఐసోలేషన్ లోనే ఉన్నారు.