MLC Election Nominations : తెలంగాణ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్లు

తెలంగాణ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు పూర్తయ్యాయి. గడువు ముగిసేలోపే అధికారపార్టీకి చెందిన అభ్యర్ధులంతా నామినేషన్‌ దాఖలు చేశారు.

10TV Telugu News

local body quota MLC elections : తెలంగాణ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు పూర్తయ్యాయి. గడువు ముగిసేలోపే అధికారపార్టీకి చెందిన అభ్యర్ధులంతా నామినేషన్‌ దాఖలు చేశారు. టీఆర్ఎస్ తరుపున ఏడుగురు సిట్టింగ్‌లు, ఐదుగురు కొత్తవాళ్లు బరిలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. మిగిలిన జిల్లాల నుంచి కాంగ్రెస్, ఇండిపెండెంట్స్ నామినేషన్స్ వేశారు. ఎనిమిది జిల్లాల్లో పోటీ అనివార్యం అయింది.

రంగారెడ్డి జిల్లా నుంచి శంభీపూర్‌ రాజు, పట్నం మహేందర్‌ రెడ్డి నామినేషన్‌ వేశారు. నల్గొండ నుంచి ఎంసీ కోటిరెడ్డి, ఆదిలాబాద్‌లో దండె విఠల్‌, నిజామాబాద్‌ నుంచి కవిత నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్ నుంచి ఎల్‌.రమణ, భానుప్రసాద్‌రావుతో పాటు టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి రవీందర్‌ సింగ్ కూడా నామినేషన్‌ వేశారు. మెదక్ నుంచి టీఆర్ఎస్ తరుపున యాదవరెడ్డి, కాంగ్రెస్ తరుపున జగ్గారెడ్డి సతీమణి నిర్మల నామినేషన్ వేశారు.

AP : ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎన్నిక

ఖమ్మం నుంచి టీఆర్ఎస్ తరుపున తాతా మధు, కాంగ్రెస్ నుంచి రాయల నాగేశ్వర్‌రావు నామినేషన్ వేశారు. మహబూబ్‌నగర్‌లో కూచికుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా తమ నామినేషన్‌ దాఖలు చేశారు. వరంగల్‌ నుంచి టీఆర్ఎస్ తరుపున పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ వేశారు.

ఖమ్మం, మెదక్, కరీంనగర్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఖమ్మం, మెదక్ జిల్లా బరిలో కాంగ్రెస్ పోటీలో నిలవగా.. కరీంనగర్ నుంచి టీఆర్ఎస్ రెబల్ బరిలో నిల్చారు. రంగారెడ్డిలో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ పత్రాలను టీఆర్ఎస్ కార్యకర్తలు చించేశారు. దీంతో రంగారెడ్డి కలెక్టరేట్‌ ముందు స్వతంత్ర అభ్యర్థి ఆందోళనకు దిగారు. డిసెంబర్‌ 10న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది.

×