Nagarjunasagar by-election : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అభ్యర్థిగా నోముల భగత్ నామినేషన్

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ నామినేషన్ వేశారు. ఆయన వెంట మంత్రులు జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి ఉన్నారు.

Nagarjunasagar by-election : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అభ్యర్థిగా నోముల భగత్ నామినేషన్

Nagarjunasagar By Election

‌Nomula Bhagat nomination for the Nagarjuna Sagar by-election : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ నామినేషన్ వేశారు. ఆయన వెంట మంత్రులు జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి ఉన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, అనుచరులతో కలిసి ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు.

నోముల భగత్‌.. 1984 అక్టోబర్‌ 10న జన్మించారు. నోముల భగత్‌ ఉన్నత విద్యావంతుడు. బీ.ఈ., ఎంబీఏ, ఎల్‌ఎల్‌ఎం చదివారు. 2008 నుంచి 2010 వరకు సత్యం టెక్నాలజీస్‌లో జూనియర్‌ ఇంజినీర్‌గా పని చేశారు. 2010 నుంచి 2012 వరకు విస్టా ఫార్మాస్యూటికల్స్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పని చేశారు. 2014 నుంచి తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. 2014 నుంచి టీఆర్‌ఎస్‌ క్రీయాశీల రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

2014 సాధారణ ఎన్నికలతో పాటు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చరుగ్గా పని చేశారు. 2014 నుంచి స్థానిక సంస్థలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రీయాశీలకంగా పనిచేశారు. టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. నోముల ఎన్‌ఎల్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌గా పని చేస్తున్నారు. ఫౌండేషన్‌ ద్వారా పేదల విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. అలాగే బలహీనవర్గాల విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.

తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో నాగార్జునసాగర్ ఉపఎన్నిక అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.