Red Alert : నాన్ స్టాప్ వర్షాలు, ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్

తెలంగాణ ప్రజలు సూర్యుడిని చూసి చాలా రోజులైంది..! కొన్ని రోజులుగా నాన్‌ స్టాప్‌గా కురుస్తున్న వర్షాలు.. తెలంగాణను అస్తవ్యస్తంగా మార్చేశాయి.

Red Alert : నాన్ స్టాప్ వర్షాలు, ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్

Tg

Non-Stop Rain In Telangana : తెలంగాణ ప్రజలు సూర్యుడిని చూసి చాలా రోజులైంది..! కొన్ని రోజులుగా నాన్‌ స్టాప్‌గా కురుస్తున్న వర్షాలు.. తెలంగాణను అస్తవ్యస్తంగా మార్చేశాయి. తెలంగాణపై మేఘ గర్జన మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 2021, సెప్టెంబర్ 07వ తేదీ మంగళవారం, సెప్టెంబర్ 08వ తేదీ బుధవారం అతి భారీ వర్షాలు కురుస్తాయన్నది అధికారుల అంచనా. మంగళవారం ఐదు జిల్లాల‌కు, బుధవారం నాలుగు జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్ హెచ్చరిక జారీ చేశారు.

Read More : HYD : 3 గంటల్లో 40 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన వృద్ధుడు

పెద్దప‌ల్లి, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ములుగు, భ‌ద్రాద్రి కొత్తగూడెం, ఖ‌మ్మం జిల్లాల్లో సోమవారం భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని సూచించింది. మిగ‌తా జిల్లాల్లో ఈ రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. తెలంగాణలో కురిసిన కుండపోత వర్షానికి పలు జిల్లాలు జలమయమయ్యాయి. మూడు రోజుల జోరు వాన, ముసురుతో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది.

Read More : Kerala : వణుకు పుట్టిస్తున్న’నిఫా’..మరో 11 మందిలో లక్షణాలు

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను వర్ష బీభత్సం కొనసాగుతోంది. వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో కుండపోతకు రోడ్లన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. సింగరేణి ఓపెన్ కాస్టు గనుల్లో రెండు రోజుల నుంచి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని, పశువులను మేతకు వదలవద్దని, వాగులు దాటే ప్రయత్నాలు చేయవద్దని అధికారులు సూచించారు.