మోడీ ఎదురుగానే కేంద్రం తీరుపై మమత ఫైర్

  • Published By: venkaiahnaidu ,Published On : May 11, 2020 / 11:56 AM IST
మోడీ ఎదురుగానే కేంద్రం తీరుపై మమత ఫైర్

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటన చేసిన తర్వాత ఇవాళ(మే-11,2020)మధ్యాహ్నం 5వసారి రాష్ట్రాల,కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్‌డౌన్‌ అమలు,ఆంక్షల సడలింపు, వలస కార్మికుల తరలింపు వంటి అంశాలపై ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడారు. అయితే వీడియోకాన్ఫరెన్స్ లో తన వంతు రాగానే తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఒక్కసారిగా ఫైరైపోయారు.

కేంద్రప్రభుత్వం కరోనా ఇష్యూపై రాజకీయాలు చేస్తుందని,రాష్ట్రాల మధ్య వివక్ష చూపుతోందని మమత ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌పై కేంద్రం  కక్షగట్టిందని విరుచుకుపడ్డారు. ఓ స్క్రిప్ట్ ప్రకారమే కేంద్రం పనిచేస్తుందని మమత అన్నారు. రాజకీయాలు చేయడానికి ఇది సరైన సమయం కాదన్నారు. కరోనా మహమ్మారి పేరుతో రాజకీయాలు చేయడం ఇకనైనా మానుకొంటే బాగుంటుందని హితవుపలికారు. ఎవ్వరూకూడా ఎప్పుడూ తమ అభిప్రాయాలు అడగలేదన్నారు. సమాఖ్య స్ఫూర్తిని అణిచివేయవద్దని మమత వీడియోకాన్ఫరెన్స్ మీటింగ్ లో మాట్లాడారు.

అన్నిరాష్ట్రాలను సమానంగా చూడాలని ఆమె కేంద్రానికి సూచించారు. తమకు కేంద్రం రాస్తున్న ఉత్తరాలు లీక్‌ అవుతున్నాయి, దీని వెనుకున్న రాజకీయం  ఏంటో మీరే చెప్పాలి. మా ప్రభుత్వం కేంద్రం నిబంధనలను అమలుపరచడం లేదంటూ మాపై నిందారోపణలు చేస్తున్నారు.. ఇది ఎంత మాత్రమూ మంచిది కాదన్నారు. అన్నిరాష్ట్రాలను సమానంగా చూడాలని ఆమె కేంద్రానికి సూచించారు. 

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రానికి మధ్య గత కొంత కాలంగా కల్డ్‌ వార్‌ సాగుతోంది…అది కాస్త  కరోనా కాలంలో మరింత ముదిరింది. కరోనా వైరస్‌ కేసుల సంఖ్య, లాక్ డౌన్ నిబంధనల సడలింపు  విషయంలో ఇప్పటికే ఇరు ప్రభుత్వాలు మాటల యుద్ధానికి దిగాయి. కరోనా కేసుల సంఖ్యను మమత సర్కార్ దాచిపెడుతోందని మమత సర్కార్ పై ఇటీవల కేంద్రం ఫైర్ అయింది. మార్చి నెలలో బెంగాల్ లో కరోనా పరిస్థితి గురించి తెలుసుకునేందుకు కేంద్ర అధికారుల బృందం బెంగాల్ లో పర్యటించిన విషయం తెలిసిందే.

అయితే ఆ అధికారులు రాష్ట్రానికి వస్తున్నట్లు తనకు అధికారికంగా సమాచరం ఇవ్వలేదని ఆరోపిస్తూ మోడీకి ఘాటైన పదజాలంతో మమత లేఖ కూడా రాసింది. కేంద్ర బృందాల అంచానా కోసం తమ రాష్ట్రాన్నే ఎందుకు ఎంపిక చేసుకోవలసి వచ్చిందంటూ ఆమె ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం కరోనా కట్టడి చర్యలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. కరోనా వైరస్ పై పోరాటంలో బిజీగా ఉన్న కొన్ని రాష్ట్రాలపై కేంద్రం ఫైట్ చేస్తోందని తృణముల్ నాయకులు ఆరోపిస్తున్నారు. 

Read Here>>> లాక్‌డౌన్ ఎత్తేస్తున్నారా? ఐదోసారి సీఎంలతో మోడీ ఏం చర్చిస్తారంటే?