Sunday Funday : ట్యాంక్ బండ్‌‌పై మరింత ఎంజాయ్ చేయొచ్చు, ఫుడ్ కోర్ట్..మ్యూజిక్

ట్యాంక్ బండ్ పై మరికాస్తా ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ ట్రాక్స్ ఏర్పాటు, సంగీత కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

Sunday Funday : ట్యాంక్ బండ్‌‌పై మరింత ఎంజాయ్ చేయొచ్చు, ఫుడ్ కోర్ట్..మ్యూజిక్

Funday

Tank Bund : ట్యాంక్ బండ్ పై మరికాస్తా ఎంజాయ్ చేయొచ్చు. ట్యాంక్ బండ్ అందాలను ఆస్వాదిస్తూ..చల్లటి వాతావరణం ఎంజాయ్ చేస్తూ..చేతులో గరం గరం కాఫీ, ఛాయ్, స్నాక్స్ తింటూ..సరదాగా గడపొచ్చు. వీకెండ్ లో ప్రజలకు మరికాస్తా వినోదం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫుడ్ ట్రాక్స్ ఏర్పాటు, సంగీత కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా..ఈ ఆదివారం ట్యాంక్ బండ్ పై కలర్ ఫుల్ గా కనిపించనుంది. ట్యాంక్ బండ్ పై ఈ సండేను మరింత ఫన్ డేగా మార్చుకోవచ్చంటూ…Arvind Kumar ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అధికారులు తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తున్నారు కొంతమంది. మరికొంతమంది సూచనలు, సలహాలు అందచేస్తున్నారు.

Reda More : Sunday Special : ట్యాంక్ బండ్ పై అమల్లోకి ఆంక్షలు
మహానగరానికి మణిహారం : –

ట్యాంక్ బండ్. హైదరాబాద్ మహానగరానికే మణిహారం అని చెప్పవచ్చు. హుస్సేన్ సాగర్ లో మధ్యలో బుద్ధుడి విగ్రహం. చుట్టుపక్కల ప్రాంతాలు, ట్యాంక్ బండ్ పై నుంచి నిలబడి చూస్తే..బిర్లా మందిర్, విద్యుత్ దీపాలతో పెద్ద పెద్ద భవంతులు కనిపిస్తుంటాయి. దీంతో ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేసేందుకు చాలా మంది విచ్చేస్తుంటారు. ట్యాంక్ బండ్ పై నడుచుకుంటే వెళ్తుంటే ఆ మజానే వేరు. ఓ వైపు హుస్సేన్ సాగర్ అందాలు, మరోవైపు విగ్రహాలను తిలకిస్తూ.. పులకించి పోతారు పర్యాటకులు. ప్రతి రోజు కాకుండ..వీకెండ్ డేస్ లో పబ్లిక్ రద్దీ విపరీతంగా ఉంటుంది. కానీ…వాహనాల రణగొణల మధ్య వారి ఆనందానికి చెక్ పెడుతోంది.

Read More : వాహనదారులకు గమనిక : ట్యాంక్ బండ్ క్లోజ్

ట్రాఫిక్ ఆంక్షలు : –
ఈ క్రమంలో… కొద్దీ రోజుల క్రితం ఓ సిటిజన్ మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ ట్యాంక్ బండ్ ట్రాఫిక్ గురించి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై స్పందించిన ఐటీ మంత్రి కేటీఆర్.. ట్రాఫిక్ విషయమై నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ని ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ మళ్లించేందుకు ఏర్పాటు చేయాలని తెలిపారు. మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రతి ఆదివారం సాయంత్రం 5 నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.

Read More : Hussain Sagar: సన్‌డే ట్యాంక్‌బండ్ దగ్గరకి వెళ్తున్నారా.. ఈ ఆంక్షలు తెలుసుకోండి!

లేజర్ షో, గ్యాలరీల ఏర్పాటు : –
దీనికి ప్రజల నుంచి విపరీతమైన రెస్పాండ్ వచ్చింది. చిన్ని పిల్లలను వెంటేసుకుని..ట్యాంక్ బండ్ పై ఎంజాయ్ చేశారు. మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు అధికారులు నడుం బిగించారు. పిల్లలకు సంబంధించిన మరిన్ని వినోద కార్యక్రమాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. హస్తకళల స్టాల్స్, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. లేజర్ షోతో పాటు..ట్యాంక్ బండ్ అన్ని వైపులా సందర్శకులు కూర్చొనే విధంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. సో..ఈ సండేను మరింత్ ఫన్ డే జరుపుకొండి.