KCR Jharkhand : బీజేపీయేతర ఫ్రంట్‌పై అనూహ్యమైన ట్విస్ట్.. ఇప్పుడు ఏ ఫ్రంట్ లేదన్న సీఎం కేసీఆర్

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ఏ దశాబ్ధాల్లో భారత్ ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశానికి కొత్త అజెండా కావాలని.. అందులో భాగంగానే అందరినీ...

KCR Jharkhand : బీజేపీయేతర ఫ్రంట్‌పై అనూహ్యమైన ట్విస్ట్.. ఇప్పుడు ఏ ఫ్రంట్ లేదన్న సీఎం కేసీఆర్

Cm Kcr Cm Soren

CM KCR And Hemant Soren : బీజేపీయేతర ఫ్రంట్‌పై అనూహ్యమైన ట్విస్ట్ ఇచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. థర్డ్‌, ఫోర్త్ ఫ్రంట్‌ ఏదీ లేదన్నారు. ఏం జరగబోతుందో భవిష్యత్‌లో తెలుస్తుందన్నారు సీఎం కేసీఆర్. 75 ఏళ్ల స్వాతంత్ర్య దేశంలో అనుకున్నంత అభివృద్ధి జరగలేదని.. ప్రజలకు అభివృద్ధి ఫలాలు దక్కాలంటే.. కొత్తగా ఏదైనా చేయాల్సిన అవసరం ఉందన్నారు. జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌తో భేటీ అయిన కేసీఆర్ దేశంలో పరిస్థితులపై చర్చించారు. గాల్వన్ లోయలో కల్నల్ సంతోష్‌బాబుతో పాటు అమరులైన సైనికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున సాయం అందించారు కేసీఆర్.

Read More : Telangana CM KCR : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో దేశ రాజకీయాలపై చర్చించా : సీఎం కేసీఆర్

ఈ సందర్భంగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ఏ దశాబ్ధాల్లో భారత్ ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశానికి కొత్త అజెండా కావాలని.. అందులో భాగంగానే అందరినీ కలుస్తున్నామని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు ఏ ఫ్రంట్ లేదని.. ఏదైనా ఉంటే చెబుతామని సీఎం స్పష్టం చేశారు. తాము ఎవరికీ అనుకూలమో.. వ్యతిరేకమో కాదన్నారు. ప్రస్తుతం కేంద్రంలో నడుస్తున్న ప్రభుత్వం, దేశాన్ని సరైన దిశలో నడిపించడం లేదని.. దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ప్రతీ భారతీయుడిపై ఉందన్నారు కేసీఆర్. దేశాన్ని మరింత ఉత్సాహంగా, అభివృద్ధి దిశగా ఎలా నడిపించాలనే ప్రయత్నాలను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే విషయాలను త్వరలోనే చర్చిస్తామన్నారు.

Read More : CM KCR : రాంచీలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు.. పెరుగుతున్న ప్రజాదరణ

ప్రస్తుతం కాంగ్రెస్‌తో కలిసి జార్ఖండ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది జెఎంఎం. ఇటీవలే కాంగ్రెస్‌తో కలిసి మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఉద్ధవ్ థాకరేను కలిశారు సీఎం. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్..నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ సీఎంతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కేసీఆర్‌కు ప్రజాదరణ పెరుగుతోంది. వారణాసిలో, రాంచీలో కేసీఆర్ భారీ కటౌట్లు దర్శనమిస్తుండడం..జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జార్ఖండ్ పర్యటన అనంతరం ప్రత్యేక విమానంలో శనివారం హైదరాబాద్ చేరుకుంటారు.