Uppal Stadium: 18న ఉప్పల్‌లో వన్డే మ్యాచ్.. 13 నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయం

అజార్ తెలిపిన వివరాల ప్రకారం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయం జరుగుతుంది. పేటీఎం యాప్‌లో ఈ టిక్కెట్ల విక్రయం ఉంటుంది. ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో ఈ నెల 15–18 వరకు ఫిజికల్ టిక్కెట్లు తీసుకోవచ్చు.

Uppal Stadium: 18న ఉప్పల్‌లో వన్డే మ్యాచ్.. 13 నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయం

Uppal Stadium: ఇటీవలే టీ20 మ్యాచ్‌కు వేదికైన హైదరాబాద్, ఉప్పల్ స్టేడియంలో త్వరలో మరో అంతర్జాతీయ మ్యాచ్ జరగబోతుంది. ఈ నెల 18 నుంచి న్యూజిలాండ్‌తో ఇండియా సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

Delhi airport: ఢిల్లీ ఎయిర్‌‌పోర్టులో బహిరంగ మూత్ర విసర్జన చేసిన వ్యక్తి.. అరెస్టు

ఈ సిరీస్ తొలి వన్డే ఈ నెల 18న జరుగుతుంది. ఈ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో వన్డే మ్యాచ్ జరగబోతుండటం విశేషం. ఈ మ్యాచ్ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజహరుద్దీన్ వెల్లడించారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్ల విక్రయం ఈ నెల 13 నుంచి ప్రారంభమవుతుందని అజార్ తెలిపారు.

Cyber Crime: సైబర్ ఉచ్చులో కామారెడ్డి వాసి.. లింక్‌పై క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకున్న యువకుడు

అజార్ తెలిపిన వివరాల ప్రకారం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయం జరుగుతుంది. పేటీఎం యాప్‌లో ఈ టిక్కెట్ల విక్రయం ఉంటుంది. ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో ఈ నెల 15–18 వరకు ఫిజికల్ టిక్కెట్లు తీసుకోవచ్చు. ఈ మ్యాచ్ కోసం ఈ నెల 14న న్యూజిలాండ్ టీమ్ హైదరాబాద్ వస్తుంది. 15న ప్రాక్టీస్ చేస్తారు. 15న శ్రీలంకతో టీమిండియాకు మ్యాచ్ ఉన్న దృష్ట్యా, 16న భారత జట్టు హైదరాబాద్ చేరుకుంటుంది. 17న ఇరు జట్లు ప్రాక్టీస్‌లో పాల్గొంటాయి.

United States: అమెరికాలో దేశవ్యాప్తంగా నిలిచిపోయిన విమానాలు.. కారణం అదే!

18న మ్యాచ్ జరుగుతుంది. గత అనుభవాల దృష్ట్యా ఆఫ్‌లైన్‌ టిక్కెట్ల విక్రయం చేయడం లేదు. అందువల్ల ప్రత్యక్షంగా మ్యాచ్ చూడాలనుకునే ప్రేక్షకులు ఆఫ్‌లైన్‌లోనే టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.