ఇసుక అక్రమ తవ్వకాల్లో బయటపడిన మృతదేహాలపై దర్యాప్తు ముమ్మరం… 10టీవీ కథనాలకు స్పందించిన అధికారులు

  • Published By: bheemraj ,Published On : November 19, 2020 / 12:47 PM IST
ఇసుక అక్రమ తవ్వకాల్లో బయటపడిన మృతదేహాలపై దర్యాప్తు ముమ్మరం… 10టీవీ కథనాలకు స్పందించిన అధికారులు

investigation on dead bodies : కరీంనగర్ జిల్లా రామడుగు మండలం పరిధిలోని వాగులో మృతదేహాలు బయపడ్డాయి. ఇసుక అక్రమ తవ్వకాల్లో శవాలు వెలుగు చూశాయి. ఇసుక తవ్వకాల్లో మృతదేహాలు బయటపడటంపై 10టీవీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు, పోలీసులు ఇసుక అక్రమాలపై విచారణ చేపట్టారు.



ఇసుక అక్రమ రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, త్వరలో వారిని పట్టుకుంటామని స్పష్టం చేశారు. కాగా ఇసుక అక్రమ తవ్వకాల్లో వాగులో పూడ్చి పెట్టిన మృతదేహాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.



జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. యదేశ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. రామడుగు మండల పరిధిలోని వాగులో సమాధులు కూల్చి పూడ్చిపెట్టిన శవాలను సైతం బయటకు తీసేసి ఇసుకను తరలిస్తున్నారు.



మృతదేహాలు బయటకు రావడంతో రామడుగు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్మశానాలకు కూడా రక్షణ లేదని వాపోతున్నారు. ఇసుక మాఫియా చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ తరలింపుపై నిరసన వ్యక్తం చేస్తూ స్థానిక తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేశారు.



ఇసుక తవ్వకాల్లో మృతదేహాలు బయటపడటంపై 10టీవీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. దీంతో స్పందించిన అధికారులు ఈ ఘటనపై ఘటనపై దర్యాప్తు చేపట్టింది. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.