Omicron : విద్యాసంస్థల మూసివేత..? క్లారిటీ ఇచ్చిన మంత్రి

మళ్లీ కోవిడ్ వ్యాపిస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా మరోసారి విద్యాసంస్థలను మూసివేస్తుందనే ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి..

Omicron : విద్యాసంస్థల మూసివేత..? క్లారిటీ ఇచ్చిన మంత్రి

Omicron Sabitha Indra Reddy

Omicron : తెలంగాణలో ఇటీవలి కాలంలో విద్యాసంస్థల్లో వరుసగా కరోనా కేసులు వెలుగుచూడటం కలకలం రేపింది. గురుకులాలు, పాఠశాలలు, కాలేజీల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇది విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురి చేస్తోంది. మళ్లీ కోవిడ్ వ్యాపిస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా మళ్లీ విద్యాసంస్థలను మూసివేస్తుందనే ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు.

LPG Cylinder : వంట గ్యాస్ సిలిండర్ బరువు భారీగా తగ్గింపు..? కేంద్రం కీలక ప్రతిపాదన

విద్యా సంస్థల్లో కరోనా వ్యాప్తిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు. స్కూళ్ల మూసివేతపై పుకార్లు నమ్మవద్దని కోరారు. పాఠశాలల్లో అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని మంత్రి సూచించారు. తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి సబిత తెలిపారు.

Gas Problem : కడుపులో గ్యాస్ సమస్య, కారణాలు ఇవే..

”విద్యాసంస్థల్లో కరోనా కేసులు వస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దు. కొన్ని హాస్టళ్లలోనే కేసులు వస్తున్నాయి. అవీ స్వల్పమే. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. స్కూళ్లలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తాం. కేసులు ఎక్కువగా వస్తే అప్పుడు విద్యాసంస్థలపై తగిన నిర్ణయం తీసుకుంటాం. టీచర్లతో పాటు తల్లిదండ్రులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలి. పాఠశాలల్లో కొవిడ్‌ ప్రమాణాలు పాటించాలి. విద్యార్థులు ఇప్పటికే రెండేళ్ల విద్యా సమయాన్ని నష్టపోయారు. వారి భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడకుండా విద్యాశాఖ అన్ని చర్యలు తీసుకుంటుంది” అని మంత్రి సబిత అన్నారు.