Omicron : ఒమిక్రాన్ రోగికి వైద్యం చేసిన డాక్టర్‌కు వేరియంట్..!

హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రి డాక్టర్‌కు పాజిటివ్‌గా తేలింది. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఒమిక్రాన్ రోగికి డాక్టర్ వైద్యం చేసే క్రమంలో వేరియంట్ సోకినట్టు భావిస్తున్నారు.

Omicron : ఒమిక్రాన్ రోగికి వైద్యం చేసిన డాక్టర్‌కు వేరియంట్..!

Doctor

Omicron Infected to the doctor : తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కు చేరింది. కరోనాను, డెల్టాను మించి…తెలంగాణను టెన్షన్ పెడుతోంది ఒమిక్రాన్. వారమంటే..వారం రోజుల్లో కేసులు డబుల్ డిజిట్ దాటిపోయాయి. కరోనా కానీ…ఇతర ఏ వేరియంట్‌ కానీ రాష్ట్రంలో ఇంత వేగంగా విస్తరించలేదు. తెలంగాణలో తొలి కేసు నమోదయిన వెంటనే..రాష్ట్రంలో వేరియంట్ వ్యాప్తి రెండో దశకు చేరిందా అన్న సందేహం కలిగిస్తోంది. ఎందుకంటే..అప్పుడే రాష్ట్రంలో విదేశాలకు వెళ్లని వారికీ ఒమిక్రాన్ సోకింది.

హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రి డాక్టర్‌కు పాజిటివ్‌గా తేలింది. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఒమిక్రాన్ రోగికి డాక్టర్ వైద్యం చేసే క్రమంలో వేరియంట్ సోకినట్టు భావిస్తున్నారు. వైరస్ వ్యాప్తి రెండో దశకు చేరితే..ఇక అడ్డుకట్ట వేయడం కష్టం. కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. వేరియంట్ తీవ్రరూపం దాలుస్తుంది. అంటే ఓ వారంలోపే తెలంగాణ మహారాష్ట్ర, ఢిల్లీలా వేరియంట్ హబ్‌గా మారే ప్రమాదం కనిపిస్తోంది.

Omicron Variant: డబుల్ సెంచరీకి మించి ఒమిక్రాన్ కేసులు.. మూడోస్థానంలో తెలంగాణ

ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో.. ఎక్కువగా నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వాళ్లలోనే బయటపడ్డాయి. విమానాశ్రయాల్లో అధికారులు ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి వస్తున్నవారిపైనే ఎక్కువ దృష్టిపెట్టడం.. నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చే వాళ్లను.. హోమ్ ఐసోలేషన్‌లో ఉండేందుకు అనుమతించడంతో.. పరిస్థితి మారుతోంది. నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన వాళ్లంతా.. బయట తిరగడంతో వారి కాంటాక్టులకు కూడా ఒమిక్రాన్ సోకుతోంది.

ఒక హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్‌కు ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలింది. కాంటాక్ట్‌ ద్వారా.. వైద్యునికి వైరస్‌ సోకినట్లు తెలుస్తోంది. ఇతర దేశాల నుంచి వచ్చిన ఒమిక్రాన్‌ బాధితుడికి వైద్యం చేయడంతో.. డాక్టర్‌ వైరస్‌ బారిన పడినట్లు సమాచారం. దీంతో.. ఆస్పత్రిలో కాంటాక్ట్స్‌ అందర్నీ క్వారంటైన్‌కు పంపింది ఆస్పత్రి యాజమాన్యం.

Omicron Cases : ప్రపంచవ్యాప్తంగా లక్ష దాటిన ఒమిక్రాన్ కేసులు.. బ్రిటన్‌లో ఒక్కరోజే 15వేల 363 నమోదు

దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. ఈ పరిస్థితుల్లో.. అన్ని రాష్ట్రాలనూ కేంద్రం అలర్ట్ చేసింది. డెల్టాకంటే ఒమిక్రాన్ మూడు రెట్లు వేగంగా వ్యాపిస్తోన్నందున.. జిల్లా, క్షేత్ర స్థాయిల్లో కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు చెప్పిన కేంద్రం… కంటైన్‌మెంట్ జోన్ల విషయంaలో కఠినంగా వ్యవహరించాలని సూచించింది.