Omicron : బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ లేదు

తాజాగా అందిన సమచారం ప్రకారం వీరిలో ఒకరికి ఒమిక్రాన్ నెగిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. ఈ మహిళ బ్రిటన్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. 

Omicron : బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ లేదు

Telangana Omicron

Omicron Case In Telangana : దేశంలో కరొనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తోంది.  ఇప్పటికే దేశ వ్యాప్తంగా 21 ఒమిక్రాన్ పాజిటివ్  కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కూడా రేపో మాపో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల నిర్ధారణ అవ్వొచ్చు అని స్వయంగా హెల్త్   డైరెక్టరే ప్రకటించారు. ఇప్పటికే 13 మంది ఒమిక్రాన్ అనుమానితులకు టిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్నారు.

వీరి జినోమ్ సీక్వెన్సింగ్ రిపోర్ట్స్ సోమవారం సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది. తాజాగా అందిన సమచారం ప్రకారం వీరిలో ఒకరికి ఒమిక్రాన్ నెగిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. ఈ మహిళ బ్రిటన్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ మహిళకు కరోనా సోకటంతో టిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు.  మిగతా 12 మంది జినోమ్ సీక్వెన్స్ రిపోర్ట్ రావాల్సి ఉంది. జనవరిలో కరొనా  థర్డ్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని తెలంగాణ ప్రజా ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్. శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
Also Read : Health Secretary Srinivasarao : ఫిబ్రవరిలో కరోనా తీవ్రత అధికంగా ఉంటుంది – శ్రీనివాసరావు
మరోవైపు రాష్ట్రంలో కరోనా పాజిటివ్  కేసులు కూడా పెరుగుతున్నాయి. కరీంనగర్‌లో ఓ మెడికల్ కాలేజీ‌లో ఆదివారం ఏకంగా 39 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఆస్పత్రులను అప్రమత్తం చేసింది. జిల్లా  ఆస్పత్రులు… పెద్దాసుపత్రుల్లో  అన్ని సదుపాయాలు సిద్ధంగా ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.