Omicron In Telangana : తెలంగాణలో 21కి చేరిన ఒమిక్రాన్ కేసులు..రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకరికి కొత్త వేరియంట్

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. ఇటీవల దుబాయ్ నుండి స్వగ్రామం గూడెంకు వచ్చిన వ్యక్తిని హైదరాబాద్ టిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

Omicron In Telangana : తెలంగాణలో 21కి చేరిన ఒమిక్రాన్ కేసులు..రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకరికి కొత్త వేరియంట్

Omicron (4)

Omicron case in Rajanna Sirisilla : ప్రపంచ దేశాలను టెన్షన్‌ పెడుతున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌.. భారత్ నూ వెంటాడుతోంది. తెలంగాణలో కూడా ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో సౌతాఫ్రికా వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. తెలంగాణలోనూ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా మరో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 21కి చేరింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. ఇటీవల దుబాయ్ నుండి స్వగ్రామం గూడెంకు వచ్చిన వ్యక్తిని హైదరాబాద్ టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అతనికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారించారు. బాధితుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో తొలి కేసు నమోదు కావడంతో వైద్య అధికార బృందం అప్రమత్తమైంది. కట్టడికి తగు చర్యలు తీసుకుంటుంది. కాగా విదేశాల నుంచి వచ్చిన 10 మందికి.. రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన ఇద్దరికి డిసెంబర్ 18న పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.

Booster Dose : బూస్టర్ డోస్ గా ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్..!

తెలంగాణలో ఒమిక్రాన్ వైరస్ సోకిన వారిని టిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తం 21 మంది ఒమిక్రాన్ బాధితులను గుర్తించారు. వీరిని కలిసిన వారికి పరీక్షలు చేస్తున్నారు అధికారులు. టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైరస్ బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇక మిగతా వారిలో స్వల్ప లక్షణాలే ఉన్నట్లు అధికారులు తెలిపారు.

సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ అందుబాటులోకి రాబోతుంది. ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఒమిక్రాన్‌ను గుర్తించే జీనోమ్ సీక్వెన్సింగ్‌ను ఏర్పాటు చేస్తుంది. గాంధీ ఆసుపత్రిలో ఒమిక్రాన్‌ జీనోమ్ సీక్వెన్సింగ్ అందుబాటులోకి వస్తే, రోజుకు 48శాంపిళ్లను పరీక్షించే అవకాశం ఉందని, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న ఈ ప్రక్రియ అందుబాటులోకి వస్తే పని వేగంగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు డాక్టర్లు. గాంధీలోనే జీనోమ్ సీక్వెన్సింగ్‌తో త్వరగా ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నారు.

Corona Vaccine : వ్యాక్సిన్ వేయించుకోనంటూ తలుపులు బిగించుకొని ఇంట్లో కూర్చున్న వ్యక్తి

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని 10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. వీటిలో మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన ఈ వేరియంట్ ఇప్పటికే తొంబైకి పైగా ప్రపంచ దేశాలకు పాకింది. చిన్న దేశాల్లో కూడా కరోనా ఈ వేరియంట్ కేసులు బయటపడుతున్నాయి. బ్రిటన్‌లో ఒమిక్రాన్ తీవ్రత అధికంగా ఉంది. ఇక్కడే తోలి ఒమిక్రాన్ మరణం నమోదైంది.

ప్రస్తుతం ఒమిక్రాన్‌ బారినపడి ఏకంగా 12 మంది మృతిచెందినట్టు బ్రిటన్‌ అధికారికంగా ప్రకటించింది. యూకేలో ఇప్పటి వరకు ఒమిక్రాన్‌తో 104 మంది వివిధ ఆస్పత్రుల్లో చేరారని బ్రిటన్‌ ఉప ప్రధానమంత్రి డొమినిక్‌ రాబ్ వెల్లడించారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 12 మంది ఒమిక్రాన్‌ బాధితులు ప్రాణాలు విడిచారని తెలిపారు.