Omicron Tension : తెలంగాణలో ఒమిక్రాన్ టెన్షన్..వైద్యారోగ్య శాఖ అలర్ట్

విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులో కోవిడ్‌ పాజిటివ్‌గా తేలితే టిమ్స్‌కు తరలిస్తున్నారు. వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌ను కూడా టిమ్స్‌లోనే ఉంచి చికిత్స అందజేస్తున్నారు.

Omicron Tension : తెలంగాణలో ఒమిక్రాన్ టెన్షన్..వైద్యారోగ్య శాఖ అలర్ట్

Telangana (1)

Omicron Tension in Telangana : తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ టెన్షన్‌ పెడుతోంది. ఒక్కొక్కటిగా కేసులు పెరుగుతుండటంతో.. అటు ప్రభుత్వం.. ఇటు వైద్యారోగ్య శాఖ అప్రమత్తం అవుతున్నాయి. విమానాశ్రయాల్లోనే ఒమిక్రాన్‌ కేసులను గుర్తించి.. వారిని గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆస్పత్రికి తరలిస్తున్నారు. అక్కడ వారిని ఐసోలేషన్‌లో ఉంచి.. ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులో కోవిడ్‌ పాజిటివ్‌గా తేలితే.. టిమ్స్‌కు తరలిస్తున్నారు.

పాజిటివ్‌ వచ్చిన వారిని.. వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌ను కూడా టిమ్స్‌లోనే ఉంచి ట్రీట్‌మెంట్‌ అందజేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో రెండు ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసులున్నాయి. టిమ్స్‌లో ఒమిక్రాన్ పేషెంట్ల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని టిమ్స్ సూపరింటెండెంట్‌ డాక్టర్ ఖాన్‌ తెలిపారు. కేసులు పెరిగినా ఇబ్బంది లేదని పేర్కొన్నారు.

Attack On Constable : మద్యం మత్తులో కానిస్టేబుల్ పై మందుబాబు దాడి

రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతికి దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలన్నారు. గర్భిణీలు కరోనా వ్యాక్సిన్ తీసుకోవద్దనే అపోహలు విడిచి పెట్టాలని తెలిపారు.

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యులే చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు కోరితే ఇంటింటికీ వచ్చి కోవిడ్ వ్యాక్సిన్ వేయిస్తామని చెప్పారు. ప్రజా ప్రయోజనార్థం, ప్రజల మనస్సులో ఉన్నది నెరవేర్చడమే తమ ప్రయత్నమన్నారు.