Omicron Third Wave : ఒమిక్రాన్.. థర్డ్ వేవ్‌కి ఆరంభం.. సొంత మందులు వాడొద్దు.. ఆస్పత్రుల్లో చేరొద్దు.. : DH శ్రీనివాసరావు

దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఒమిక్రాన్ రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసుల పెరుగుదల అనేది.. మూడో వేవ్‌ సూచనగా పేర్కొన్నారు.

Omicron Third Wave : ఒమిక్రాన్.. థర్డ్ వేవ్‌కి ఆరంభం.. సొంత మందులు వాడొద్దు.. ఆస్పత్రుల్లో చేరొద్దు.. : DH శ్రీనివాసరావు

Omicron Third Wave Omicron Cases Surge, The Begining Of Third Wave, Says Public Health Director Srinivasa Rao

Omicron Third Wave : దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఒమిక్రాన్ రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వేల, లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు పెరగడం చూస్తున్నామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌ డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు 400శాతం పెరిగాయని అన్నారు. ఒమిక్రాన్ కేసుల పెరుగుదల అనేది.. మూడో వేవ్‌కి ప్రారంభమన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ అత్యధిక కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరిలో విపరీతంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోందని చెప్పారు.

ఇది ముందే అంచనా వేసినట్టుగా ఆయన తెలిపారు. రెండు రోజుల క్రితమే ఒమిక్రాన్ వ్యాప్తిపై సీఎం మంత్రులు, అధికారులతో చర్చించారని, రెగ్యులర్‌గా సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. 4 రోజుల్లో 4రేట్లకు పైగా పాజిటివిటీ రేటు పెరుగుతోందన్నారు. డెల్టా వేరియెంట్ కన్నా ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. వ్యాధి వ్యాప్తి తీవ్రంగానే ఉందని, కాకపోతే సీరియస్ అవ్వడం లేదన్నారు. 90శాతం మందిలో అసలు లక్షణాలే కనిపించడం లేదన్నారు. మరో 10శాతం మందిలో కూడా సాధారణ లక్షణాలే ఉన్నాయని అన్నారు.

లక్షణాలంటే వెంటనే టెస్టు చేయించుకోండి :
వ్యాధి లక్షణాలుంటే తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. డెల్టాలో పాజిటివ్ వచ్చిన 3రోజుల తరువాత లక్షణాలు బయటపడ్డాయని, కానీ ఒమిక్రాన్ అలా కాదన్నారు. వైరస్ సోకిన సంగతి తెలియకుండానే వ్యాధి వ్యాప్తి వేగంగా జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. సాధారణ లక్షణాలు ఉన్నవారు ఆస్పత్రుల్లో అడ్మిట్ కావొద్దని సూచించారు. సీరియస్ ఉన్నవాళ్లు మాత్రమే ఆస్పత్రులకు వెళ్లాలని సూచించారు. అనవసరంగా ఆస్పత్రులకు వెళ్లి బెడ్స్ హోల్డ్ చేయరాదని, ఆక్సిజన్ సాచురేషన్ తక్కువగా ఉంటేనే అడ్మిట్ కావాలని డాక్టర్ శ్రీనివాసరావు సూచనలు చేశారు.

పేషెంట్స్‌ను అడ్మిట్ చేసుకోవద్దు.. ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మస్ట్ :
ఒమిక్రాన్ స్వల్ప లక్షణాలున్న బాధితులను అనవసరంగా ఆస్పత్రుల్లో అడ్మిట్ చేసుకోవద్దని ప్రైవేట్ హాస్పిటల్స్‌కి డీహెచ్ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు ఆస్పత్రులు తప్పనిసరిగా కోవిడ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ పాటించాలని సూచించారు. అనవసర మెడిసిన్ వాడకూడదని తెలిపారు. అలాగే .. ఒమిక్రాన్‌పై కాక్ టయిల్ కూడా పనిచేయడం లేదని తేలిందన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ వారికి వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. ఒమిక్రాన్ భయంతో ఆస్పత్రులకు వచ్చే ప్రజల్ని భారంలోకి నెట్టవద్దని డీహెచ్ శ్రీనివాసరావు సూచించారు.

ప్రజలు సొంత వైద్యం జోలికి వెళ్లొద్దు.. :
దేశంలో నాలుగు వారాలుగా ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. చాలా వేగంగా ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నెలాఖరులోగా ఒమిక్రాన్ వ్యాపి మరింత పెరిగే అవకాశం లేకపోలేదని డీహెచ్ శ్రీనివాసరావు ప్రజలను హెచ్చరించారు. ఫిబ్రవరిలోగా భారీగా కొవిడ్ కేసులు నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఫిబ్రవరి చివరికి లోఎస్ట్‌కి పడిపోయే ఛాన్స్ ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే చాలా నష్టపోతామని హెచ్చరించారు. అనవసరంగా జన సమూహాల్లోకి వెళ్లకూడదని, మాస్క్ మరువకూడదు.. వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ ఐసోలేషన్ కిట్స్ పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. కిట్స్ కూడా ఇప్పటికే ప్రోక్యూర్ చేసుకున్నట్టు తెలిపారు. ఆక్సిజన్ పరంగా, మెడిసిన్, సౌకర్యాల పైన సమీక్ష సమావేశం జరిగాయని, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసినట్టు డీహెచ్ శ్రీనివాస్ వెల్లడించారు.

పండుగ వేడుకల్లో భౌతిక దూరం తప్పనిసరి :
పండగలు వేడుకల్లో గాధరింగ్స్ లేకుండా చూసుకోవాలని డీహెచ్ శ్రీనివాసరావు సూచించారు. రాజకీయ పార్టీలు వచ్చే నాలుగు వారాలు…. ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా రద్దు చేసుకోవాలని సూచించారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని.. ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని అన్నిరకాలు ప్రోగ్రామ్స్ రద్దు చేసుకోవాలని డీహెచ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలను ప్రతిఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు 101 శాతం పూర్తి అయ్యిందన్నారు. 2nd డోస్ 71శాతం మాత్రమే పూర్తి అయ్యిందని చెప్పారు.

కొత్త నిబంధనలు ఉండవు.. పాతవే పాటించాలి :
ఒమిక్రాన్ కేసుల పెరుగుదల నేపథ్యంలో కొత్త కొవిడ్ నిబంధనలేమి ఉండవన్నారు. ప్రస్తుతమున్న నిబంధనలే వర్తిస్తాయని చెప్పారు. అవే కొవిడ్ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాల్సిందిగా సూచించారు. సరిహద్దుల్లో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందన్నారు.

ఒమిక్రాన్ వేరియంట్.. కమ్యూనిటీ‌లోకి వచ్చేసింది :
ఒమిక్రాన్ వేరియంట్ కమ్యూనిటీలోకి వచ్చేసిందన్నారు. ఈ రోజు నుంచి ప్రత్యేకంగా ఒమిక్రాన్ కేసులపై ప్రత్యేక బులిటెన్ ఉండదని చెప్పారు. అన్ని కేసులు ఒక్కటేనన్నారు. అన్ని PHCల్లో కోవిడ్ క్లినిక్స్ ప్రారంభించినట్టు చెప్పారు. హోమ్ కిట్ అందిస్తున్నామని, ఫీవర్ సర్వే కూడా కొనసాగుతుందని డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు.

Read Also : Omicron Common Cold : ఒమిక్రాన్‌… సాధారణ జలుబు కాదు.. లైట్ తీసుకోవద్దు.. WHO హెచ్చరిక..!