Omicron Variant : ఒమిక్రాన్ భయం..టెస్టుల పేరిట దోపిడీ!

ఎయిర్ పోర్టుల్లో మాత్రం వీటి ధర సామాన్యునికి అందని స్థాయిలో ఉంటోంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానశ్రయంలో వీటి ధర 4వేల 500గా ఉంది.

Omicron Variant : ఒమిక్రాన్ భయం..టెస్టుల పేరిట దోపిడీ!

Covid Test

Omicron Variant : ఒమిక్రాన్ భయంతో ప్రపంచం వణికిపోతోంది. కరోనా సమయంలోలానే ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను చూసి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇదే అదనుగా టెస్టులు పేరుతో దోపిడీ జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీపీసీఆర్ టెస్టులు, యాంటీజెన్ టెస్టుల పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికులను అందిన కాడికి దోచుకుంటున్నారు. ఎయిర్ పోర్టుల్లో టెస్టులు తప్పనిసరి చేయడంతో ప్రయాణికులంతా విధిగా వాటిని చేయించుకోవాల్సి వస్తోంది. ఎయిర్ పోర్టుల్లో ఒక్కో టెస్టుకు వసూలు చేస్తున్న మొత్తం చూస్తే కళ్లు తిరగాల్సిందే. సాధారణంగా కరోనా టెస్టింగ్ సెంటర్లలో యాంటీజెన్‌ టెస్టు ధర 500 రూపాయలు మాత్రమే.

Read More : Corona Cases : దేశంలో కొత్తగా 9,765 కరోనా కేసులు.. 477 మంది మృతి

కానీ ఎయిర్ పోర్టుల్లో మాత్రం వీటి ధర సామాన్యునికి అందని స్థాయిలో ఉంటోంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానశ్రయంలో వీటి ధర 4వేల 500గా ఉంది. నిత్యం వేలమంది ఈ ఎయిర్ పోర్టు నుంచి విదేశాలకు వెళ్తుంటారు. సాధారణ ప్రయాణికులు, వీఐపీలు, సంపన్నులు, ఉద్యోగులకు ఈ మొత్తంతో ఎలాంటి సమస్యా లేకపోయినప్పటికీ…ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రయాణికులకు, అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులకు 4వేల 500 అన్నది చాలా పెద్ద మొత్తం. అప్పో  సప్పో చేసో..ఆస్తులు అమ్మో..అతి కష్టం మీద విమానం టికెట్ కొని విదేశాలకు వెళ్లే బడుగు జీవులపై టెస్టుల భారం భరించలేనిదిగా తయారయింది.

Read More : TDP : క్షమాపణలు చెప్పడానికి ఇంత సమయం పట్టిందా ?

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయాన్ని లోక్‌సభలో ప్రస్తావించారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో యాంటిజెన్‌ టెస్టుల పేరుతో దోపిడీ చేస్తున్నారని లోక్‌సభలో ప్రస్తావించారు కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. RT-PCR నెగిటివ్ రిపోర్ట్ ఉన్నప్పటికీ యాంటిజెన్‌ టెస్టులు చేస్తున్నారన్నారు. 4 వేల 500 రూపాయలు వసూలు చేస్తున్నారని లోక్‌సభ దృష్టికి తీసుకెళ్లారు. ప్రైవేట్ ఏజెన్సీలు టెస్టులు చేయడం వల్ల దోపిడీ జరుగుతోందని.. కేంద్రం దీనిని అరికట్టాలని అన్నారు ఎంపీ కోమటిరెడ్డి.

Read More : Body Weight : ఉదయం కంటే రాత్రి వేళల్లో మన శరీరం బరువు ఎక్కువగా ఉంటుందా!…

హైదరాబాద్‌తో పాటు దేశంలోని అనేక విమానాశ్రయాల్లో యాంటీజెన్ టెస్టుల ధర అధికంగానే ఉంది. అయితే హైదరాబాద్‌తో పోలిస్తే…మిగిలిన ఎయిర్‌పోర్టుల్లో ధర కాస్త తక్కువగానే ఉంది. బెంగళూరులో యాంటీజెన్ టెస్టు కోసం రూ. 3 వేల 900 వెచ్చించాల్సి ఉండగా…ఢిల్లీ విమానాశ్రయంలో రూ. 3 వేల 900 వసూలు చేస్తున్నారు. ముంబై ఎయిర్ పోర్టులో టెస్టు ధర అధికంగానే ఉంది. హైదరాబాద్‌లో లాగానే రూ. 4 వేల 500 వసూలు చేస్తున్నారు. టెస్టుల పేరుతో ప్రయివేట్ ఏజెన్సీలు దోచుకోకుండా ప్రభుత్వమే ధరలు నిర్ధారించాలన్న డిమాండ్ పెరుగుతోంది.