A Wonderful Gift For Sister: రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్కకు తమ్ముడి అపురూప కానుక .. ఆశ్చర్య పోయిన కుటుంబ సభ్యులు..

రాఖీ పౌర్ణమి అంటే అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని తెలిపే పండుగ. శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకున్నారు. రాఖీ కట్టిన సోదరీమణులకు చీర, తోచినంత నగదు బహుమతిగా ఇచ్చి ఎల్లప్పుడూ నీకు నేనే అండగా ఉంటానంటూ సోదరులు దీవించారు.

A Wonderful Gift For Sister: రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్కకు తమ్ముడి అపురూప కానుక .. ఆశ్చర్య పోయిన కుటుంబ సభ్యులు..

brother's amazing gift to sister..

A Wonderful Gift For Sister: రాఖీ పౌర్ణమి అంటే అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని తెలిపే పండుగ. శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకున్నారు. రాఖీ కట్టిన సోదరీమణులకు చీర, తోచినంత నగదు బహుమతిగా ఇచ్చి ఎల్లప్పుడూ నీకు నేనే అండగా ఉంటానంటూ సోదరులు దీవించారు. అయితే ఖమ్మం జిల్లాలో మాత్రం ఓ వ్యక్తి తన అక్కకు పెద్ద సర్ ఫ్రైజ్ ఇచ్చాడు. తమ్ముడు ఇచ్చిన బహుమతికి అక్కతో పాటు బావ, కుటుంబ సభ్యులు ఆశ్చర్య పోయారు.

Har Ghar Tiranga: ‘హర్ ఘర్ తిరంగా’ కోసం 20 కోట్ల జాతీయ జెండాలు సిద్ధం

కొణిజర్ల స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బొలగాని బసవనారాయణ ఖమ్మం నగరంలో నివాసముంటున్నాడు. ఆయనకు కుమార్తె రణశ్రీ, కుమారుడు త్రివేది. అతడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని రూ. 5నాణేలుగా మార్చి దాచుకునేవాడు. అలా దాచుకున్న సొమ్ము ఓ బస్తాకు అయింది. అయితే ఎందుకు వీటిని దాచుకుంటున్నావని పలు సార్లు తల్లిదండ్రులు, అక్క అడిగినా చెప్పలేదు.

Salman Rushdie: సల్మాన్ రష్దీపై దాడి ఎలా జరిగింది.. ‘ది సాటానిక్ వెర్సెస్’ అనే పుస్తకమే ఇందుకు కారణమా..?

అక్కకు పెళ్లై అత్తారింటికి వెళ్లింది. పెళ్లి తరువాత తొలిసారి రక్షా బంధన్ కట్టేందుకు అక్క వస్తుండటంతో గొప్ప బహుమతి ఇద్దామని త్రివేది అనుకున్నాడు. తన చిన్నతనం నుంచి దాచుకున్న నాణేలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వారం సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాక ఓ ఫంక్షన్ మాదిరి స్టేజీ డెకరేట్ చేసి అక్కను ఆహ్వానించారు. అక్కాబావ రావడంతో స్టేజీపై వారిని ఉంచి ఓ పెద్దకాంటాను తెచ్చి అందులో అక్కను కూచ్చోబెట్టాడు. ఆ తరువాత తాను దాచుకున్న నాణేలను తెచ్చి అక్కకు తులాభారం వేసి ఆమె బరువుకు సరిపడిన రూ. 5నాణేలను కానుకగా ఇచ్చాడు. రణశ్రీ 61 కిలోలు ఉండటంతో తులాభారంలో 11,200 వేల నాణేలు తూగాయి. వాటి విలువ రూ. 56వేలు. తమ్ముడు ఇచ్చిన సర్ ఫ్రైజ్ గిఫ్ట్ తో అక్కతో పాటు బావ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విషయం తెలిసిన స్థానికులు ఆశ్చర్య పోయారు.