తెలంగాణలో Covid-19 : లక్షణాలు లేని వారు లక్ష మంది

  • Published By: madhu ,Published On : September 9, 2020 / 08:27 AM IST
తెలంగాణలో Covid-19 : లక్షణాలు లేని వారు లక్ష మంది

Telangana : తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. ఏ మాత్రం లక్షణాలు లేని వారు లక్ష మంది ఉంటారని అంచాన వేస్తున్నారు. సోమవారం నాటికి లక్షా 45 వేల 163 కరోనా పాజిటివ్ కేసులు రాగా..ఎలాంటి లక్షణాలు లేని కేసులు 1, 00, 162 మంది ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. లక్షణాలుండి నమోదైన కరోనా కేసులు 45,001 (31%) ఉన్నట్లు తెలిపారు.




మరోవైపు కరోనా పరీక్షలను ఎక్కువ సంఖ్యలో నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 18 లక్షల 27 వేల 905 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. సోమవారం 60 వేల 923 మందికి పరీక్షలు నిర్వహిస్తే…2 వేల 392 మంది కరోనా బారిన పడితే..2 వేల 346 మంది కోలుకున్నారు. ఒక్కరోజే 11 మంది చనిపోయారు. మరణాల సంఖ్య 906కి చేరింది. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య లక్ష 12 వేల 587 చేరింది.
https://10tv.in/guidelines-in-unlock-4-ap-september-21-to-9-10-inter-students-allowed-to-go-to-schools/



* ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 31, 670.
* 24,579 మంది ఇళ్లు లేదా ఇతరత్రా సంస్థల ఐసోలేషన్లలో.
* జీహెచ్‌ఎంసీలో 304. రంగారెడ్డిలో 191, కరీంనగర్‌లో 157. మేడ్చల్‌లో 132. * ఖమ్మంలో 116. నల్లగొండలో 105. నిజామాబాద్‌లో 102. సూర్యాపేటలో * * * 101 కేసులు రికార్డయ్యాయి.