CM KCR : ఇంటికి లక్ష రూపాయలు.. మరో కొత్త పథకం, ఈ నెల 9 నుంచి ప్రారంభం- సీఎం కేసీఆర్

CM KCR : తలసరి ఆదాయంలో మనమే నెంబర్ వన్. తలసరి విద్యుత్ ఉత్పత్తిలో మనమే నెంబర్. రైతుబంధు, రైతు భీమా తెచ్చుకున్నాం.

CM KCR : ఇంటికి లక్ష రూపాయలు.. మరో కొత్త పథకం, ఈ నెల 9 నుంచి ప్రారంభం- సీఎం కేసీఆర్

CM KCR (Photo : Google)

CM KCR – Nagarkurnool : నాగర్ కర్నూల్ లో భారీ బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాకుంటే నాగర్ కర్నూల్ జిల్లా వచ్చేది కాదన్నారు. రాష్ట్ర సాధన తర్వాత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు ఈ ప్రాంతానికి వచ్చాయని చెప్పారు. నేను ఎంపీగా ఉంటూనే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం అని కేసీఆర్ అన్నారు. పాలమూరు కీర్తి కిరీటాలు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతాయన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు కేసీఆర్.

ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు:
”తలసరి ఆదాయంలో మనమే నెంబర్ వన్. తలసరి విద్యుత్ ఉత్పత్తిలో మనమే నెంబర్. పెన్షన్లు, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయి. దళిత జాతిని ఉద్ధరించే విధంగా దలితబంధు స్కీమ్ తీసుకొచ్చి ఒక్కొక్క కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తున్నాం. ఒకప్పుడు పాలమూరులో గంజి కేంద్రాలు ఉండేవి. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. మంచి నీటి సౌకర్యం కల్పించాం. మిషన్ భగీరథతో ఇంటింటికీ నీరు అందిస్తున్నాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఐదు మెడికల్ కాలేజీలు మంజూరు చేసుకున్నాం. తెలంగాణ రాకముందు ఎందుకు మెడికల్ కాలేజీలు తీసుకురాలేదు.(CM KCR)

Also Read..Minister KTR : అమెరికాలో కూడా ఇలాంటి విధానం లేదన్నారు.. కారణం సీఎం కేసీఆర్ పాలనే..

భూముల రేట్లు పెరిగిపోయాయి:
పెద్ద పెద్ద నాయకులు ఈ ప్రాంతాన్ని పరిపాలించి ప్రజలకు మంచి నీరు అందించలేని దుస్థితి. తెలంగాణ రాష్ట్రంలో సాగు నీరు తెచ్చుకున్నాం. చెరువులు నింపుకున్నాం. పాలమూరు అంతా పచ్చబడుతోంది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకుని 20 లక్షల ఎకరాలకు సాగు అందించే పనిలో ఉన్నాం. పాలమూరు పంట పొలాలను చూసి ఆనందపడుతున్నా. వలసలు ఆగిపోయాయి. భూముల రేట్లు పెరిగిపోయాయి. పాలమూరు ప్రజలు లక్షల రూపాయలతో బొడ్రాయి పండుగలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు పాలమూరును చూసి కన్నీళ్లు పెట్టుకున్నా.

ధరణి లేకపోతే ఎన్ని పంచాయతీలు, గొడవలు జరిగేవి:
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతం చూసి గర్వపడుతున్నా. పాలమూరు జిల్లాలో మండలాలు పెంచుకున్నాం. రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేశాం. ధరణి వల్ల రైతు సంతోషంగా ఉన్నాడు. పారదర్శకంగా ధరణి పని చేస్తోంది. పైరవీలకు తావు లేదు. బంగాళాఖాతంలో విసిరేస్తా అంటున్నారు. ఇది పద్దతినే. ఒకప్పుడు రైతుల రక్తం తాగిన వాళ్ళే ఇవాళ ధరణి గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ రాజ్యం లంచాలకు కేరాఫ్ అడ్రస్. బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే రైతు రాజ్యం. ధరణి లేకపోతే ఎన్ని పంచాయతీలు అవుతుండే. గొడవలు జరిగేవి. ఈ రోజు ఆ పరిస్థితి ఉందా?(CM KCR)

Also Read..Koratla constituency: తనయుడి కోసం పోటీ నుంచి తప్పుకోనున్న సిట్టింగ్ ఎమ్మెల్యే.. జూనియర్ జువ్వాడి సైతం..

అదే లేకపోతే ఎన్ని మర్డర్లు అయితుండే?
ధరణితో 99శాతం భూముల సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఒకటి రెండు ఇబ్బందులు ఉండొచ్చు. ఇవాళ ధరణి లేకపోతే భారీగా పెరిగిన భూముల ధరకు ఎన్ని పంచాయితీ అయితుండే? ఎన్ని పోలీస్ కేసులు అయితుండే? ఎన్ని మర్డర్లు అయితుండే? ఇవ్వాళ అది లేదు. పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి. ఇక్కడి మోడల్ కావాలని మహారాష్ట్ర రైతులు అడుగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే రైతు రాజ్యం.

తస్మాత్ జాగ్రత్త..
కాంగ్రెస్ కుట్రలు చేసే ప్రయత్నాలు చేస్తోంది. రైతుబంధు, రైతు భీమా తెచ్చుకున్నాం. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. కొన్ని పార్టీలు మోసం చేసే కుట్ర చేస్తున్నాయి. మోసపోతే గోస పడుతాం. తస్మాత్ జాగ్రత్త. బీసీ కులాలకు ఇంటికి లక్ష రూపాయలు ఇస్తాం. ఈ నెల 9 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాo. తెలంగాణలో అత్యంత సంతృప్తి ఇచ్చింది. తెలంగాణ పచ్చ బడింది. ఆగస్ట్ మాసంలో పాలమూరు లిఫ్ట్ తో నీళ్ళు తీసుకొస్తాం. తెలంగాణ మోడల్ దేశమంతా కోరుకుంటోంది” అని కేసీఆర్ అన్నారు.