Musi Project : భారీ వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

భారీగా వరద నీరు చేరడంతో నీటిపారుదలశాఖ అధికారులు మూసీ ప్రాజెక్టు 3 క్రస్ట్‌గేట్లు ఎత్తారు. 3 ఫీట్ల మేర పైకి ఎత్తి నీటికి దిగువకు వదులుతున్నారు.

Musi Project : భారీ వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

Musi

Ongoing flooding to the Musi project : హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. భారీగా వరద నీరు చేరడంతో నీటిపారుదలశాఖ అధికారులు మూసీ ప్రాజెక్టు 3 క్రస్ట్‌గేట్లు ఎత్తారు. 3 ఫీట్ల మేర పైకి ఎత్తి నీటికి దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం మూసీ ఇన్‌ఫ్లో 4 వేల 136.18 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 6 వేల 14 క్యూసెక్కులుగా ఉంది.

మరోవైపు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ముసురు పట్టింది. నల్లగొండ, సూర్యాపేట, నార్కట్ పల్లి, నూతనకల్, కట్టంగూర్, ఆత్మకూరు, కేతేపల్లి తదితర మండలాల్లో కురిసిన వర్షాలకు చెరువులు, కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరింది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Test Captain : బీసీసీఐకి కొత్త సవాల్‌.. కోహ్లీ స్థానంలో ఎవరు..?

పలు చోట్ల ఇళ్లలోకి నీరు వచ్చింది. రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లాలో అత్యధిక వర్షపాతం కురిసింది. సూర్యాపేట జిల్లాలోని ఎర్కకారంలో అత్యధికంగా 14.5 సెంటిమీటర్ల వర్షం కురిసింది. నల్లగొండలోని అయిటిపాములలో 11.5 సెంటిమీటర్లు, కట్టంగూర్‌లో 11.1 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.

సూర్యాపేట జిల్లాలో కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో అర్థరాత్రి నుంచి ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నకిరేకల్ మండల వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి తాటికల్ గ్రామ శివారులో వాగు ఉప్పొంగుతోంది. దీంతో నల్లగొండ – నకిరేకల్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు వరదల్లో చిక్కుకున్న ఎనిమిది మంది కూలీలను స్థానికుల కాపాడారు.