Ganesh Immersion : ట్యాంక్‌బండ్‌పై కొనసాగుతున్న గణేశ్ నిమజ్జనం..బారులు తీరిన విగ్రహాలు

ట్యాంక్‌బండ్‌పై భక్తుల కోలాహలం ఏమాత్రం తగ్గలేదు. గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్నటి మొదలైన నిమజ్జనం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది.

Ganesh Immersion : ట్యాంక్‌బండ్‌పై కొనసాగుతున్న గణేశ్ నిమజ్జనం..బారులు తీరిన విగ్రహాలు

Immersion

Ganesh Immersion on the Tank Bund : ట్యాంక్‌బండ్‌పై భక్తుల కోలాహలం ఏమాత్రం తగ్గలేదు. గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్నటి మొదలైన నిమజ్జనం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. నిమజ్జనం కోసం వినాయక విగ్రహాలు ఇంకా భారీగా వస్తూనే ఉన్నాయి. నిమజ్జనం కోసం గణపయ్యలు భారీగా బారులు తీరారు. ట్యాంక్‌బండ్‌ చుట్టూ గణనాథుడి విగ్రహాలతో వాహనాలు క్యూ కట్టాయి.

ఇటు హిమాయత్‌నగర్‌, అటు బషీర్‌బాగ్‌, ఇంకోవైపు సికింద్రాబాద్‌, మరోవైపు ఖైరతాబాద్‌ ఎటు చూసిన గణేష్‌ విగ్రహాలు నిమజ్జనం కోసం బారులు తీరాయి. నిన్నటి నుంచి మొదలైన గణేశ్‌ నిజ్జనం కంటిన్యూగా సాగుతూనే ఉంది. ఇప్పటికే 30వేలకుపైగా విగ్రహాలను నిమజ్జనం చేశారు.

ఇక ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనోత్సవం ఘనంగా జరుగుతోంది. నవరాత్రులు విశిష్ట పూజలందుకున్న బొజ్జ గణపయ్యలు.. గంగమ్మ ఒడికి చేరుతున్నారు. నిన్నటి నుంచి ఏమాత్రం జోష్‌ తగ్గకుండా గణపయ్యను సాగనంపుతున్నారు భక్తులు. ఇప్పటికీ వందలాది విగ్రహాలు ట్యాంక్‌బండ్‌ వైపు సాగుతున్నాయి. ఆ విగ్రహాలన్నీ నిమజ్జనం పూర్తి కావాలంటే ఉదయం 10 గంటలయ్యే అయ్యే అవకాశం ఉంది.

Tank Bund : గణేష్ నిమజ్జనం, ట్యాంక్ బండ్‌‌పై 40 క్రేన్లు..ప్రత్యేక నిఘా

నగరం నలుమూలల నుంచి మండపాల నుంచి ట్యాంక్ బండ్‌కు తరలుతున్నారు. దీంతో హుస్సేన్‌సాగర్‌, ట్యాండ్‌బండ్‌ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. జై బోలో గణేశ్‌ మహరాజ్‌ కీ జై… నినాదాలతో ట్యాంక్‌బండ్‌ పరిసరాలు మార్మోగుతున్నాయి. డీజే పాటలకు తగినట్టుగా యువత డ్యాన్స్‌లతో హోరెత్తిస్తున్నారు. ఎటు చూసినా జనంతో… హుస్సేన్‌సాగర్ పరిసరాలన్నీ జన సాగరాన్ని తలపిస్తున్నాయి.