Operation Dakshin : ఆపరేషన్ దక్షిణ్ మొదలెట్టనున్న బీజేపీ-కర్ణాటక సీఎం బొమ్మై

దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి విస్తరించేందుకు ఆపరేషన్ దక్షిణ్  చేపట్టాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పిలుపునిచ్చారు. హైదారాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన ఈ తీర్మానం చేశారు. 

Operation Dakshin : ఆపరేషన్ దక్షిణ్ మొదలెట్టనున్న బీజేపీ-కర్ణాటక సీఎం బొమ్మై

Basavaraj Bommai

Operation Dakshin :  దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి విస్తరించేందుకు ఆపరేషన్ దక్షిణ్  చేపట్టాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పిలుపునిచ్చారు. హైదారాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన ఈ తీర్మానం చేశారు.  దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో అధికారం చేపట్టేందుకు….బిజెపి తన కేడర్‌ను విస్తరించేందుకు ఆయన పలు సూచనలు చేసారు. మైనారిటీ ఓట్లు బలంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లోనే అధికారంలోకి వచ్చినప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం సుసాధ్యం అని ఆయన అన్నారు.

ముస్లిం జనాభా అధికంగా ఉన్న ఆజంఘడ్, రాంపూర్ నియోజకవర్గాల్లో బిజెపి గెలుపు దక్షిణాది రాష్ట్రాలకు శుభసూచకమన్న కార్యవర్గ సమావేశం అభిప్రాయ పడింది. కర్ణాటకలో ప్రభుత్వ స్థాపన తర్వాత తెలంగాణలో అధికారం చేపట్టడం సమీప లక్ష్యం అని బొమ్మై అన్నారు. కేరళలో బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేశారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ పార్టీ స్వతంత్రంగా ఎదగాలని బొమ్మై సూచించారు.

విభిన్న సామాజిక వర్గాల సమాహారంగా ఉన్న కేరళలోనూ పార్టీ బలపడడానికి సానుకూలతలపై ఈ సమావేశంలో బీజేపీ చర్చించింది. బలహీన వర్గాలకు చేరువవుతూ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని దక్షిణాది రాష్ట్రాల నేతలకు బీజేపీ కార్యవర్గ సమావేసం లక్ష్యాన్ని నిర్దేశించింది.

Also Read : PM Modi: అధికారమే లక్ష్యంగా పనిచేయాలి.. తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాని దిశానిర్దేశం